అగార్కర్ అవుట్.. : టీమిండియా నెక్స్ట్ చీఫ్ సెలెక్టర్ గా.. !!
బీసీసీఐ సెలక్షన్ కమిటీలో కీలక మార్పులు చోటుచేసుకునున్నాయి. ప్రస్తుత చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పదవీ కాలం ముగింపు దశకు చేరుకుంది. అక్టోబర్ 4వ తేదీతో అగార్కర్ కాంట్రాక్ట్ ముగియబోతోంది. మంచి ట్రాక్ రికార్డే ఉన్నప్పటికీ.. అతని కాంట్రాక్ట్ గడువును పొడిగించడానికి బీసీసీఐ సుముఖంగా లేదు. ఇటీవల గువాహటిలో జరిగిన సెలక్షన్ కమిటీ సమావేశానికి అజిత్ అగార్కర్ అందుబాటులో లేకపోవడం కూడా దీనికి మరింత బలాన్ని చేకూర్చింది.
వెస్టిండీస్‌తో రెండో వన్డే మ్యాచ్ ప్రారంభానికి ఒక రోజు ముందు బర్సాపారా స్టేడియంలో ఈ కీలక భేటీ ఏర్పాటైంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తో పాటు సెలెక్టర్ల ప్యానెల్ సభ్యులు శివ్ సుందర్ దాస్, అజయ్ రాత్రా, ఆర్పీ సింగ్ ఇందులో పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో టీమిండియా.. న్యూజీలాండ్‌లో పర్యటించాల్సి ఉంది. అక్టోబర్ 22 నుంచి నవంబర్ 27 వరకు సుదీర్ఘంగా సాగుతుందీ టూర్. మొత్తం అయిదు చొప్పున టీ20, వన్డే ఇంటర్నేషనల్స్ తో పాటు రెండు టెస్ట్ మ్యాచ్‌లను ఆడుతుంది.

అక్టోబర్ 22న క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరిగే మొదటి టీ20 మ్యాచ్‌తో ఈ మెగా సిరీస్ ప్రారంభం కానుంది. ఈటూర్‌కు సంబంధించిన భారత జట్టు ఎంపికపై కోచ్ గౌతమ్ గంభీర్‌తో సెలెక్టర్లు ఈ భేటీలో విస్తృతంగా చర్చించారు.. గువాహటీ భేటీలో. దీనికి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ హాజరు కాకపోవడంతో అతని కాంట్రాక్ట్ ముగిసినట్టయింది. ఇక తదుపరి చీఫ్ సెలక్టర్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే అంశం.. కొద్దిరోజులుగా చర్చనీయాంశమౌతోంది.
ఈ క్రమంలో.. తదుపరి చీఫ్ సెలెక్టర్‌గా టీమిండియా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓఝా ను నియమించాలని బీసీసీఐ నిర్ణయించింది. ప్రస్తుతం సెలెక్షన్ కమిటీకి తాత్కాలిక చీఫ్ సెలెక్టర్గా వ్యవహరిస్తోన్నాడీ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్. చీఫ్ సెలెక్టర్ రేసులో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ పార్థివ్ పటేల్ పేరు మొదట్లో వినిపించినప్పటికీ.. బీసీసీఐ మాత్రం ఓఝా వైపే మొగ్గు చూపుతోంది. టీమిండియా తరఫున 24 టెస్టులు ఆడిన అనుభవం ఉంది ఓఝాకు.
న్యూజీలాండ్ పర్యటనలో నవంబర్ 15న చివరి వన్డే ముగిసిన నాలుగు రోజుల వ్యవధిలోనే అంటే.. నవంబర్ 19 నుంచి వెల్లింగ్టన్‌లో భారత్ మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రెండు ఫార్మాట్లకు ఎంపికయ్యే కీలక ఆటగాళ్లను ముందే టెస్ట్ సిరీస్ సన్నాహాల కోసం పంపించే అంశంపై గౌతమ్ గంభీర్, సెలెక్టర్లతో చర్చించారు. గౌతమ్ గంభీర్ దూకుడుకు తగినట్లుగా ఓఝా సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ తీసుకునే తదుపరి నిర్ణయాలు టీమిండియా భవిష్యత్ ను ప్రభావితం చేయనున్నాయి.












Click it and Unblock the Notifications
