కొర్రలు ఈ సమస్యలు ఉన్నవారు తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు..!!
ప్రస్తుత కాలంలో చాలా మంది జీవన శైలిలో మార్పు కనిపిస్తోంది. ఆహార అలవాట్లు మార్చేసి.. ఆరోగ్యం పైన శ్రద్ద చూపుతున్నారు. మిల్లెట్లకు ప్రాధాన్యత పెరుగుతోంది. చిరు ధాన్యాల్లో దేనికదే ప్రత్యేకత కలిగి ఉంది. అండు కొర్రలు..వీటినే బ్రౌన్ టాప్ మిల్లెట్స్ అని ఆంగ్లంలో పిలుస్తారు. అండు కొర్రలు మనకు అనేక పోషకాలను అందించడంతోపాటు ఆరోగ్య ప్రయోజనాలు లభించేలా చేస్తాయి. అండు కొర్రలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మధుమేహ వ్యాధి గ్రస్తులతో పాటుగా ఇతర సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ప్రయోజనాలు ఉన్నాయి.
మిల్లెట్లు.. కొర్రలతో అనేక ఆరోగ్యకరమై ప్రయోజనాలు ఉన్నాయి. అండుకొర్రలను 100 గ్రాములు తింటే మనకు సుమారుగా 300 క్యాలరీల మేర శక్తి లభిస్తుంది. అండుకొర్రల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది కనుక జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ఇది జీర్ణక్రియను పెంపొందిస్తుంది. పేగుల్లో మలం కదలికలను నియంత్రిస్తుంది. దీంతో మలబద్దకం తగ్గిపోతుంది. అండుకొర్రలను తినడం వల్ల జీర్ణ వ్యవస్థలో ఉండే వ్యర్థాలు సులభంగా బయటకు పోతాయి. జీర్ణ వ్యవస్థ మొత్తం శుభ్రంగా మారుతుంది. అండు కొర్రల్లో గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ కూడా చాలా తక్కువ. అందువల్ల అండుకొర్రలను తింటే షుగర్ లెవల్స్ పెరగవు. డయాబెటిస్ ఉన్నవారు అండుకొర్రలను తీసుకోవటం ద్వారా మేలు జరుగుతుంది. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది.

ఇక, అండుకొర్రలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) తగ్గుతుంది. వీటిల్లో ఉండే మెగ్నిషియం, పొటాషియం రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. బీపీ నియంత్రణలో ఉంటుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరిగేలా చేస్తాయి. దీని వల్ల రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అండు కొర్రల్లో క్యాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నిషియం అధికంగా ఉండడం వల్ల ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి క్యాన్సర్ కణాలు పెరగకుండా చూస్తాయి. క్యాన్సర్ల నుంచి రక్షణను అందిస్తాయి. ఇలా మిల్లెట్లు.. అండకొర్రలను ఆహారంలో భాగం చేసుకుంటే పలు అనారోగ్య సమస్యల నుంచి బయట పడే అవకాశం ఉంటుంది.












Click it and Unblock the Notifications