తెలంగాణ నూతన సీఎస్ గా, రేవంత్ అనూహ్య ఎంపిక- ఉత్తర్వులు జారీ..!!

తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుత సీఎస్ రామకృష్ణా రావు పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త సీఎస్ ఎంపికపై గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఉత్కంఠకు తెరపడింది. కొత్త సీఎస్ విషయం లో పలువురి పేర్లు తెర పైకి వచ్చినా.. సీఎం రేవంత్ సుదీర్ఘ కసరత్తు తరువాత అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా కొత్త సీఎస్ నియామకం పైన ఉత్తర్వులు జారీ చేసారు.

తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు బాధ్యతలు చేపట్టేందుకు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర సీఎస్‌గా సేవలందిస్తున్న కె. రామకృష్ణా రావు పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త సీఎస్ ఎంపికపై గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిని మన్నించిన కేంద్ర ప్రభుత్వం, కేంద్ర సర్వీసుల్లో ఉన్న సంజయ్ జాజును తిరిగి మాతృ రాష్ట్ర కేడర్‌కు (తెలంగాణకు) పంపుతూ కీలక నిర్ణయం తీసుకుంది. 1992 బ్యాచ్ కు ఐఏఎస్ అధికారి సంజయ్ జాజూ ఉమ్మడి ఏపీలో పలు హోదాల్లో పని చేసారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (MCH) కమిషనర్‌గా సేవలందించారు.

నిర్మలమ్మ శాఖ మార్పు, ప్రధాన్ ఔట్- నితీశ్..చద్దా బాధ్యతలు ఫిక్స్, ఎవరికి ఏ శాఖ..!!
నిర్మలమ్మ శాఖ మార్పు, ప్రధాన్ ఔట్- నితీశ్..చద్దా బాధ్యతలు ఫిక్స్, ఎవరికి ఏ శాఖ..!!
telangana-govt-appoints-senior-ias-officer-sanjay-jaju-as-the-new-chief-secretary-here-the-full-det

రేవంత్ లక్ష్యాలకు అనుగుణంగా

సంజయ్ జాజూ సుమారు 13 ఏళ్లకు పైగా కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. ఇన్ఫర్మేషన్ & బ్రాడ్‌ కాస్టింగ్, డోనర్ (DoNER) సెక్రటరీగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో పలు శాఖల్లో పని చేసిన అనుభవం ఉన్న అధికారి కావటంతో సీఎం రేవంత్ ఆయన వైపు మొగ్గు చూపారు. రేవంత్ రాష్ట్రంలో మ్యూజీ ప్రాజెక్ట్, మెట్రో విస్తరణ, ప్రాంతీయ రింగ్ రోడ్డు వంటి భారీ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు, నిధులు త్వరితగతిన సాధించడమే లక్ష్యంగా ఆయన అనుభవాన్ని ఉపయోగించుకోవాలని సీఎం రేవంత్ భావించినట్లు తెలుస్తోంది. కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయిన సంజయ్ జాజూ ఈ నెల 30న సీఎస్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత సీఎస్
రామకృష్ణా రావు పదవీ విరమణ తరువాత ముఖ్యమంత్రి రేవంత్ కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+