కేబినెట్ లోకి ఆర్బీఐ మాజీ గవర్నర్, వీరు ఔట్- కొత్త మంత్రులు..శాఖల మార్పు ఇలా..!?

కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కీలక కసరత్తు జరుగుతోంది. ఈ నెలాఖరులోగానే మంత్రి వర్గ ప్రక్షాళన పూర్తి చేయాలని భావిస్తున్నారు. మోదీ 4.0 కార్యాచరణలో భాగంగా కీలక మార్పుల కు రంగం సిద్దం అవుతోంది. ప్రభుత్వంతో పాటుగా పార్టీలోనూ కీలక మార్పులు చేయనున్నారు. పలు వురి మంత్రులను తప్పించేందుకు రంగం సిద్దమైంది. కొత్త మంత్రులకు అవకాశంతో పాటుగా కీలక మంత్రుల శాఖల్లోనూ మార్పుల దిశగా నిర్ణయాలు జరుగుతున్నాయి.

ప్రధాని మోదీ తన కేబినెట్ ను పూర్తి స్థాయిలో ప్రక్షాళనకు నిర్ణయించారు. దీంతో, కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఉత్కంఠ కొనసాగుతోంది. జూన్ 28 లేదా జూన్ 29వ తేదీన కేంద్ర మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. మంత్రివర్గం లోకి ఆర్బీఐ మాజీ గవర్నర్, ప్రధాని ముఖ్య కార్యదర్శి శక్తి కాంత దాస్‌కు మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌ శాఖ మారుస్తారని చెబుతున్నారు. ఆమెకు విద్యాశాఖ కేటాయించనున్నట్లు సమాచారం. విద్యాశాఖ చూస్తున్న ధర్మేంద్ర ప్రధాన్ ను కేబినెట్ నుంచి తప్పించటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకుంటారు.

నిర్మలమ్మ శాఖ మార్పు, ప్రధాన్ ఔట్- నితీశ్..చద్దా బాధ్యతలు ఫిక్స్, ఎవరికి ఏ శాఖ..!!
నిర్మలమ్మ శాఖ మార్పు, ప్రధాన్ ఔట్- నితీశ్..చద్దా బాధ్యతలు ఫిక్స్, ఎవరికి ఏ శాఖ..!!
pm-modi-may-induct-shaktikanta-das-into-union-cabinet-amid-reshuffle-buzz-key-changes-in-portfolios

సుదీర్ఘ కసరత్తు.. కీలక మార్పులు

ఎన్‌డీఏకు మద్దతు ఇచ్చిన శివసేనకు ఈ మంత్రివర్గంలో చోటు లభించే అవకాశం ఉంది. ఆ పార్టీ ఎంపీ శ్రీకాంత్ షిండేకు మంత్రి పదవి లభించనుంది. కొత్త మంత్రుల జాబితాలో ఎంపీలు అరుణ్ గోవిల్, విష్ణుదత్ శర్మ, జనార్దన్ సింగ్ సిగ్రీవాల్ పేర్లు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందుకోసం ప్రస్తుత ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరిని కేబినెట్‌ నుంచి తప్పించే అవకాశం ఉంది. పంజాబ్‌లో పార్టీ బలోపేతం కోసం రవ్‌నీత్ బిట్టు స్థానంలో తరుణ్ చుగ్‌కు స్థానం కల్పించనున్నారు. కేంద్ర మంత్రి ప్రతాప్‌ రావు జాదవ్‌తో పాటు మనోహర్ లాల్ ఖట్టర్ శాఖలు మార్చే అవకాశం ఉంది. కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రదాన్, హర్దీప్ సింగ్ పూరీతోపాటు అరడజను మంది సహాయ మంత్రులను మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశం ఉందని సమాచారం. దీంతో.. ప్రధాని మోదీ నిర్ణయాల పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+