UPI Charges: అప్పుడు జీఎస్టీ, టీడీఎస్ - ఇప్పుడు యూపీఐ ..! జనం ఆందోళన వెనుక ?
కేంద్ర ప్రభుత్వం తాజాగా పార్లమెంట్ లో యూపీఐ లావాదావీలపై ఛార్జీలు (UPI Charges)వసూలు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును ఆమోదించింది. అనంతరం బ్యాంకులకు యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేసుకునేందుకు అనుమతి కూడా ఇచ్చింది. త్వరలోనే బ్యాంకులు తమ ఖాతాదారులు చేసే యూపీఐ ట్రాన్సాక్షన్లపై మోత మోగించేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే దీనిపై విమర్శలు వస్తుండటంతో కేంద్ర ఆర్దికమంత్రి నిర్మలా సీతారామన్ అవి వ్యాపారులకేనని, వ్యక్తిగత ఖాతాదారులకు కాదని వివరణ ఇచ్చారు. అయినా దీనిపై దుమారం ఆగడం లేదు. ఇంతకీ జనంలో ఈ ఆందోళన వెనుక కారణాలేంటో చూద్దాం..
యూపీఐ ఛార్జీల మోతపై జనంలో వ్యక్తమవుతున్న ఆందోళన వెనుక కొన్ని సహేతుక కారణాలు కనిపిస్తున్నాయి. వీటిలో ప్రధానమైనది ప్రత్యక్షంగా వ్యక్తులు చేసే యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయబోమని కేంద్రం చెప్తున్నప్పటికీ వ్యాపారాలపై విధించే ఛార్జీల్ని వారు సహజంగానే కస్టమర్లపై బాదేందుకు ప్రయత్నిస్తారు. అప్పుడు యూపీఐ ఛార్జీల మోత భారం మోయాల్సింది కస్టమర్లే అవుతారు తప్ప వ్యాపారులు కాదు. ఇది జనంలో నెలకొన్న ప్రధానమైన ఆందోళన.

అలాగే గతంలో జీఎస్టీ (GST) విధానం తెచ్చినప్పుడు కూడా ఇది కేవలం వ్యాపారులకు ఉద్దేశించిందే తప్ప వ్యక్తులపై లేదా కస్టమర్లపై ఎలాంటి భారం ఉండదని కేంద్రం ఊదరగొట్టింది. కానీ వాస్తవానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న జీఎస్టీని హోటళ్ల నుంచి ప్రతీ వ్యాపారీ వినియోగదారుకే బహిరంగంగానే బదిలీ చేస్తున్నాడు. దీంతో జీఎస్టీ వ్యాపారులకే అన్న భ్రమ తొలగిపోయింది. ఇదే కోవలో టీడీఎస్ (ఉద్యోగుల జీతాల్లో నుంచి ముందే పన్ను వసూలు చేసే విధానం) అమల్లోకి తెచ్చినప్పుడు కూడా ఇది కేవలం యాజమాన్యాలకే అన్నారు. కానీ ఇప్పుడు టీడీఎస్ (TDS)ను ఉద్యోగుల ఖాతాల్లో నుంచే సంస్థలు నెలలవారీగా కోత పెడుతున్నాయి. ఇలా ఏడాది పొడవునా సంస్థలు పెట్టే పన్నుల కోతను సదరు ఉద్యోగి ఐటీ రిటర్న్ దాఖలు చేసినప్పుడు క్లెయిమ్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఇదొక్కటే ఇక్కడ ఊరట. ఈ నేపథ్యంలో యూపీఐ ఛార్జీల్ని జీఎస్టీ, టీడీఎస్ విధానాలతో జనం పోలుస్తున్నారు.




Click it and Unblock the Notifications