మిరియాలు ఇలా తీసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలు దూరం..!!
మిరియాలు. ప్రతీ ఇంటా ఖచ్చితంగా ఉంటాయి. ఇవి రుచికే కాదు, ఆరోగ్య పరంగానూ ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నల్ల మిరియాలను 'బ్లాక్ గోల్డ్' గా పిలుస్తారు.వీటిలో సి, కె విటమిన్లు, ఫైబర్, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. మిరియాల్లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియాల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు సమృద్ధిగా ఉండటంతో ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి.
మిరియాల్లో ఉన్న గుణాలు ఆరోగ్య పరంగా మేలు చేస్తాయి. మిరియాల్లో జీర్ణరసాలు, ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపించి, ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులోని పైపెరిన్ అనే క్రియాశీలక సమ్మేళనం పేగుల పనితీరును మెరుగుపరుస్తుంది. ఇందులోని ప్రధాన ఆల్కలాయిడ్ భాగం పైపెరిన్ అభిజ్ఞా మెదడు పనితీరులో సహాయపడతుంది. మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. మిరియాలు శ్లేష్మాన్ని తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. జ్వరాలు, గ్యాస్ట్రిక్, శ్వాసకోశ, మూత్ర వ్యాధుల ఆయుర్వేద చికిత్సలో దీనిని వినియోగించే వారని అధ్యయనంలో పేర్కొంది. మిరియాలు శరీరంలో మెటబాలిజంను పెంచి, కొవ్వును వేగంగా కరిగించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.

నల్లమిరియాలు బరువు తగ్గడంలో సహాయపడతాయని, అంతేకాకుండా సైనస్, ఉబ్బసం, నాసికా రద్దీని నయం చేస్తుందని, ఇది క్యాన్సర్, గుండె, కాలేయ వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని ప్రముఖ జర్నల్ ప్రచురించింది. మిరియాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. మిరియాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చూసి, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు వెల్లడించారు. అంతేకాకుండా కాలేయాన్ని శుభ్రం చేసి, దాని పనితీరును మెరుగుపరచడంతో పాటు ఫ్యాటీ లివర్ సమస్యను కూడా అదుపులో ఉంచుతుందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications