ఈ విషయాలు తెలిస్తే ఆరోగ్యానికి మిరియాలు చేసే మేలు మరచిపోలేరు
మిరియాలు, భారతీయ వంటకాలలో వినియోగించే ఒక మసాలా దినుసు. మిరియాలు సంప్రదాయ వైద్యంలో గణనీయమైన విలువను కలిగి ఉంది. దాని మసాలా రుచికి ప్రసి. మసాలా మాత్రమే కాదు, మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తున్న ఆరోగ్య ప్రదాయిని. శతాబ్దాలుగా ఉపయోగించబడుతున్న మిరియాలు జీర్ణక్రియకు సహాయపడుతుందని మరియు శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని నమ్ముతారు. దాని ప్రయోజనాలు ప్రాచీన భారతీయ వైద్య విధానం అయిన ఆయుర్వేదంలో చాలా గొప్పగా చెప్పారు.
మిరియాలలో గొప్ప గుణాలు
మిరియాలలో చాలా పోషకాలు ఉంటాయి. మిరియాలలో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫైబర్, విటమిన్ సి, విటమిన్ కె వంటి పోషకాలు ఉంటాయి. మిరియాలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్, యాంటీ వితల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.

మిరియాలతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు
మిరియాలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మనకు జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఈ ప్రక్రియ ఉబ్బరం మరియు గ్యాస్ వంటి జీర్ణ సమస్యలను నివారించేందుకు దోహదం చేస్తుంది. మన జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మిరియాలు చేసే మేలు అంతా ఇంతా కాదు. మిరియాల లో పైపెరిన్ అనే క్రియాశీలకమైన సమ్మేళనం ఉంటుంది. దీనిని కలిగి ఉండడం వల్ల, శరీరంలో ప్రీ రాడికల్స్ వల్ల కణాలకు కలిగే నష్టాన్ని నివారిస్తుంది.
మిరియాలతో ఈ సమస్యలకు చెక్
మిరియాల వలన శరీరంలో ఆక్సిడెంట్ ఒత్తిడి తగ్గుతుంది. శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది. దగ్గు జలుబు వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు వాటి నుండి ఉపశమనం కోసం మిరియాలను తీసుకోవచ్చు. మిరియాల లో ఉండే పైపెరిన్ కారణంగా ప్రీ రాడికల్స్ కారణంగా కణాలకు జరిగే నష్టాన్ని నివారించవచ్చు. మిరియాల లో క్యాన్సర్ కారక కణాలను నిరోధించే లక్షణాలు ఉన్నాయి.
మిరియాలతో బరువు సమస్య నుండి ఉపశమనం
నిత్యం మిరియాలను ఆహారంలో భాగం చేసుకోవటం వలన బరువు తగ్గటానికి కూడా ఇది దోహదం చేస్తుంది. మిరియాలు శరీరంలో ఉండే చెడు కొవ్వును తగ్గించి బరువు తగ్గిస్తుంది. మిరియాలు మనం తీసుకునే ఆహారానికి అదనపు విలువను చేకూర్చడం తో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఇస్తాయి అయితే మిరియాలు ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వాటిని ఒక క్రమ పద్ధతిలో వినియోగించాలి కానీ, ఆరోగ్యం వస్తుందని ఇష్టారాజ్యంగా మిరియాలను ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిది కాదు. ఇది అనవసరమైన అనర్ధాలకు కారణమవుతుంది.












Click it and Unblock the Notifications