ఈ సీజన్ లో డయాబెటిస్ రోగులకు సూపర్ పండు ఇదే!
నేరేడు పండు.. వర్షాకాలంలో దొరికే అద్భుతమైన పండు. చాలామంది డయాబెటిస్ బాధితులు ఏ పండ్లు తినాలి అని ఆలోచిస్తూ ఉంటారు. వర్షాకాలంలో దొరికే ఈ సీజనల్ పండు డయాబెటిస్ బాధితులకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. నేరేడు పండు తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు నేరేడు పండ్లు మధుమేహాన్ని కంట్రోల్ చేయడంతో పాటు బరువు తగ్గడంలో దోహదం చేస్తాయి.
నేరేడు పండ్లలో ఫుల్ పోషకాలు
ప్రకృతి సిద్ధంగా లభించే నేరేడు పండ్లు మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. నేరేడు పండులో ఫుల్ గా పోషకాలు ఉంటాయి. నేరేడు పండులో విటమిన్ సి, విటమిన్ బి, క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్ తో పాటు ఇతర పోషకాలు ఉంటాయి. నేరేడు పండులో పుష్కలంగా ఉండే పోషకాలు మన శరీరానికి కావలసిన ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తాయి.

డయాబెటిస్ బాధితులకు బెస్ట్ పండ్లు
నేరేడు పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయం చేస్తుంది. నేరేడు పండు గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే పండు, కాబట్టి ఇది డయాబెటిస్ పేషెంట్స్ కు ఎంతో బాగా పనిచేస్తుంది. అయినప్పటికీ డయాబెటిస్ పేషెంట్స్ నేరేడు పండ్లను కూడా ఎక్కువ తినకూడదు. 10 నుండి 12 పండ్లను మాత్రమే తినాలి.
నేరేడు పండ్లతో ఆరోగ్యం
నేరేడు పండ్లను తినడం వల్ల రక్తంలోని హిమోగ్లోబిన్ సమతుల్యం అవుతుంది. నేరేడు పండ్లలో ఉండే విటమిన్ సి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నేరేడు పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మన చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలని భావించేవారికి నేరేడు పండ్లు ఒక మంచి ఎంపిక.
నేరేడు పండ్లు ఇలాగే తినాలి
నేరేడు పండ్లు మన శరీరంలో వ్యర్ధాలను బయటకు పంపించడానికి, కడుపుని శుభ్రం చేయడానికి, జీర్ణశక్తిని మెరుగుపరచడానికి దోహదం చేస్తాయి. అన్నిటికంటే డయాబెటిస్ బాధితులకు ఎంతో బాగా ఉపయోగపడే నేరేడు పండ్లను తినండి అయితే ముఖ్యంగా మితంగా తినాలి అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కచ్చితంగా గుర్తు పెట్టుకోండి.












Click it and Unblock the Notifications