ఓ అల్లం ముక్క వేసి ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగితే ఎన్నో ప్రయోజనాలు

సొరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో అధిక మొత్తంలో నీరు ఉండటం వల్ల శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే, ఇందులో పుష్కలంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపర్చుతుంది. కడుపు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. బరువు తగ్గాలనుకునే చాలా మంది తమ ఆహారంలో సొరకాయ రసాన్ని చేర్చుకుంటారు. ఉదయం ఖాళీ కడుపుతో సొరకాయ రసం తాగడం వల్ల నిజంగా బరువు తగ్గుతారా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

సొరకాయ రసంలో కేలరీలు తక్కువగా ఉంటాయి, కొవ్వు శాతం అస్సలు ఉండదు. అందుకే బరువు తగ్గాలనుకునేవారు లేదా ఆరోగ్యకరమైన బరువును నిర్వహించుకోవాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన ఎంపిక. దీనిని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సొరకాయ రసం PCOD/PCOS నియంత్రణలోనూ ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఇందులో ఫైబర్, నీటి శాతం ఎక్కువ ఉండటం, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల బరువు నియంత్రణ, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి, శరీరంలో మంటను తగ్గించడానికి దోహదపడుతుంది.

దీన్ని తరచుగా అల్లం, పుదీనా (లేదా) తులసి గింజలతో కలిపి తీసుకుంటారు. చేదుగా లేని తాజా సొరకాయ రసం మాత్రమే వాడాలి. సొరకాయ రసం శరీరంలో జీవక్రియ (మెటబాలిజం) రేటును పెంచే లక్షణాలను కలిగి ఉంటుంది. ఆరోగ్యకరమైన జీవక్రియతో, శరీరం ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది, ఇది బరువు నిర్వహణకు కీలకంగా పనిచేస్తుంది.

ఫైబర్‌తో సమృద్ధిగా ఉండే సొరకాయ రసం ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. ఇది ఆకలిని నియంత్రించి, అనారోగ్యకరమైన చిరుతిళ్ళను తినకుండా నిరోధిస్తుంది. అంతేకాకుండా, జీర్ణవ్యవస్థకు ఫైబర్ చాలా మంచిది. ఆహారంలో సొరకాయ రసాన్ని చేర్చుకోవడం వల్ల మూత్రం, వ్యర్థాల ద్వారా శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో సొరకాయ రసం తాగడం వల్ల పెద్దగా దుష్ప్రభావాలు ఉండవని నిపుణులు చెబుతున్నారు.

సొరకాయ జ్యూస్ తయారీకి కావాల్సిన పదార్థాలు: అర సొరకాయ (తొక్క తీసి, ముక్కలుగా కోసినవి). గుప్పెడు కొత్తిమీర ఆకులు లేదా పుదీన. ఒక ఉసిరికాయ, అర నిమ్మకాయ, చిన్న అల్లం ముక్క, సరిపడా నీరు.

తయారుచేసే విధానం: సొరకాయ ముక్కలు, కొత్తిమీర లేదా పుదీనా, ఉసిరికాయ, అల్లం, నీటిని బ్లెండర్‌లో వేసి మెత్తగా అయ్యే వరకు కలపండి. అవసరమైతే వడకట్టి, నిమ్మరసం పిండి వెంటనే సేవించండి.

చేదు రుచి ఉంటే ఆ రసం పాడైనట్టు. దానిని అస్సలు తాగకూడదు. రసం తయారుచేయడానికి ముందు దాని నాణ్యతను, పరిశుభ్రతను నిర్లక్ష్యం చేయకూడదు. పాడైపోయిన లేదా చేదుగా ఉన్న సొరకాయ రసం తాగితే, అది తీవ్రమైన జీర్ణ సమస్యలకు దారితీయవచ్చు. వాంతులు, కడుపు నొప్పి, అతిసారం, అలాగే అంతర్గత రక్తస్రావం వంటివి కూడా సంభవించవచ్చు. అందుకే కిడ్నీ సమస్యలు ఉన్నవారు లేదా సొరకాయ అలర్జీ ఉన్నవారు దీనిని తీసుకోకూడదు.

Disclaimer: సొరకాయ రసం అందరికీ ప్రయోజనకరమైనప్పటికీ, దీన్ని తీసుకునే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం ముఖ్యం. ఈ కథనం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ వైద్య సలహా లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఎటువంటి ఆరోగ్య సమస్యలకైనా వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+