గ్యాస్ తో అవసరం లేని, వండనవసరం లేని బ్రేక్ ఫాస్ట్ లు.. ట్రై చెయ్యండి!

వంట గ్యాస్ లేకుండా వంట చేయడం చాలా కష్టం. ఇళ్లల్లో ఇప్పుడు గ్యాస్ కొరత నేపథ్యంలో వంటలు విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది ఈరోజు మనం స్టవ్ వెలిగించాల్సిన అవసరం లేకుండా చేసే కొన్ని బ్రేక్ ఫాస్ట్ లను తెలుసుకుందాం. ఈ బ్రేక్ ఫాస్ట్ లు ఆరోగ్యంతో పాటు, మన ఆకలిని కూడా తీరుస్తాయి.

పెరుగుతో అల్పాహారం

పెరుగుతో మనం చేసుకునే ఒక బ్రేక్ ఫాస్ట్ మనకు ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. చల్లని చిక్కటి పెరుగును తీసుకొని అందులో అరటిపండు ముక్కలు, డ్రై ఫ్రూట్స్, గింజలు వేసి బాగా మిక్స్ చేసి, అందులోని తేనె లేదా బెల్లం వేసి తీసుకుంటే ఇది మన శరీరానికి కావలసిన ప్రోటీన్, క్యాల్షియం, తోపాటు శక్తిని కూడా ఇస్తుంది.

Breakfasts without using gas stoves Ideas For healthy breakfasts with the present gas shortage

ఓవర్ నైట్ ఓట్స్ తో అల్పాహారం

ఓవర్ నైట్ ఓట్స్ కోసం ఒక సీసా తీసుకుని అందులో రోల్డ్ ఓట్స్ ను పాలు లేదా పెరుగు వేసి నానబెట్టాలి. అందులో నానబెట్టిన చియా సీడ్స్, డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్, తేనె కలుపుకొని, ఫ్రిజ్లో పెట్టుకొని ఉదయాన్నే ఈ మిశ్రమాన్ని బ్రేక్ ఫాస్ట్ కింద తింటే మంచి సులభమైన రుచికరమైన అల్పాహారం అవుతుంది.

మొలకలతో అల్పాహారం

అధిక ప్రోటీన్ ఉండే సులభంగా జీర్ణమయ్యే పెసలు శనగలు వంటి వాటిని నీళ్లలో నానబెట్టుకోవాలి . రాత్రంతా నానిన వాటిని మొలకలు వచ్చే వరకు ఒక తడిగుడ్డలో చుట్టి పెట్టుకోవాలి. మొలకలు వచ్చిన తర్వాత వాటిని శుభ్రంగా కడిగి నీరు లేకుండా చేసి, కీర దోసకాయ, టమాటా, ఉల్లిపాయ, తురిమిన క్యారెట్ వెయ్యాలి.

ఆరోగ్యంగా ఉండే ఈ బ్రేక్ ఫాస్ట్ లు

కొద్దిగా నిమ్మరసం కొద్దిగా సాల్ట్ కొంచెం జీలకర్ర పొడి ఆలివ్ ఆయిల్ వేసి మిక్స్ చేసి ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ కింద తింటే కడుపు నిండుగా ఉండటమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటాం. గ్యాస్ కొరత వేళ ఇంట్లో ఉన్న వంట గ్యాస్ ను ఊరికే వేస్ట్ చేయక, చాలా సింపుల్ గా, ఆరోగ్యంగా ఉండే ఈ బ్రేక్ ఫాస్ట్ ని కచ్చితంగా ట్రై చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+