డయాబెటిస్ పేషెంట్స్ రాగిజావ ఎక్కువగా తాగుతున్నారా?

డయాబెటిస్.. ఇప్పుడు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి. ప్రతి పదిమందిలో ఐదుగురు డయాబెటిస్ బాధితులు ఉంటున్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. డయాబెటిస్ ను పట్టించుకోకపోతే మనకు తెలియకుండానే మన ప్రాణాలను హరిస్తుంది. డయాబెటిస్ తో బాధపడేవారు మందులు తీసుకోవడంతో పాటు ముఖ్యంగా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం చాలా అవసరం.

అన్నానికి బదులుగా రాగిజావ
తినే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించడం, ప్రతిరోజు వ్యాయామం చేయడం, యోగ సాధన చేయడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, ప్రతిరోజు ఏడు నుండి ఎనిమిది గంటల పాటు నిద్రపోవడం ఎంతో అవసరం. ఇక్కడ డయాబెటిస్ తో బాధపడేవారు డయాబెటిస్ ను కంట్రోల్ చేసుకోవడం కోసం చాలామంది అన్నానికి బదులుగా రాగిజావ ను తీసుకుంటున్నారు.

Can diabetic patients take Ragi malt what happens with ragi malt over consumption

రాగి జావతో డయాబెటిస్ బాధితులకు ప్రయోజనం కలుగుతుందా?
అయితే రాగిజావ ని తీసుకోవడం మంచిదేనా? రాగి జావతో డయాబెటిస్ బాధితులకు ప్రయోజనం కలుగుతుందా అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.రాగులలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అంతేకాదు తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. అటువంటి రాగులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి. రాగులలో ఉండే ఫైబర్ కారణంగా జీర్ణక్రియ మందగిస్తుంది.

మధుమేహం ఉన్నవారికి ఇది మేలు చేస్తుందా?
ఇది రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరగడానికి సహాయపడుతుంది. కాబట్టి ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుందని చెప్పవచ్చు. ఇక్కడ చెక్కర స్థాయిలను వేగంగా రాగులు పెంచకపోవడం వల్ల, మధుమేహం ఉన్నవారు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. అయితే రాగిజావ ని తీసుకోవడంలో ఒక ప్రమాదం కూడా ఉంది. రాగి జావను మితంగా తీసుకుంటే అది మన బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది.

మోతాదు కంటే ఎక్కువగా తీసుకుంటే డేంజర్
రాగి జావ ని తీసుకుంటే ఏమి కాదు అన్న ఉద్దేశంతో దానిని మోతాదు కంటే ఎక్కువగా తీసుకుంటే మళ్లీ అది మన బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడానికి కారణమవుతుంది. పచ్చ జొన్నలు, సజ్జలు, కొర్రలు, ఒండ్రు కొర్రలు వంటి వాటితో పోల్చి చూస్తే రాగులు కాస్త త్వరగా షుగర్ లెవెల్స్ పెంచుతాయని చెప్పవచ్చు.

రాగిజావ తీసుకోవాలంటే ఇలా చెయ్యండి
కాబట్టి రాగిజావ ని తీసుకోవాలనుకునే వారు మితంగా తీసుకుంటే మంచిది. మీ ఆహారంలో మీరు రాగిజావ ను చేర్చాలి అనుకుంటే, మీ డయాబెటిస్ కు సంబంధించి చికిత్స తీసుకుంటున్న వైద్య నిపుణులతో సంప్రదించి ఆయన సూచన మేరకు తీసుకోవడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+