నిద్ర పట్టటం లేదా? అయితే ఈ టిప్స్ మీ కోసమే!
కొంతమంది ఎంత పని చేసినప్పటికీ, అలసిపోయినప్పటికీ నిద్రపోవడానికి ఎంత ప్రయత్నం చేసినా నిద్ర పట్టదు. నిద్రలేమి సమస్యతో చాలామంది ప్రస్తుత రోజుల్లో బాధపడుతున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. నిద్ర విషయంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే మనకు నిద్రలేమి సమస్య కలగడానికి కారణమని చెబుతున్నారు.
నిద్ర పట్టటానికి కొన్ని టిప్స్
అయితే నిద్ర పట్టడానికి కొన్ని చిన్న చిన్న టిప్స్ ఉన్నాయని ఆ టిప్స్ ఫాలో అయితే ప్రశాంతంగా నిద్ర పోవచ్చు అని చెబుతున్నారు.నిద్రలేమి సమస్యతో బాధపడేవారు అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండాలి. పరుగులు పెడుతున్న ఆలోచనలు మనుషులకు నిద్ర పట్టకపోవడానికి అతి పెద్ద అడ్డంకి అందుకే మైండ్ కామ్ డౌన్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరు శ్వాసపై దృష్టి పెట్టాలి.

నిద్రకు ముందు ఇవి తీసుకోకండి
డీప్ బ్రీత్ తీసుకొని నెమ్మదిగా శ్వాసను బయటకు వదలాలి. ఇలా చేస్తే మనసు ప్రశాంతంగా మారి నిద్ర పట్టేందుకు అవకాశం ఉంటుంది. ఇక నిద్ర పట్టక ఇబ్బంది పడేవారు నిద్ర వేళకు కొన్ని గంటల ముందు కాఫీ, టీ, చాక్లెట్లను తీసుకోవడం మానేయండి. .పడుకునే ముందు వీటిని తీసుకున్నా, భారీగా భోజనం చేసినా అది నిద్రను కష్టతరం చేస్తుంది.
వీటితో నిద్రలేమి సమస్య .. జాగ్రత్త
ఇక నిద్రకు ఉక్రమించే ముందు కొంతమంది ఆల్కహాల్ ను తీసుకుంటారు. ఇది కూడా నిద్రలేమి సమస్యకు కారణం అవుతుంది. కాబట్టి ఆల్కహాల్ వినియోగాన్ని తగ్గించండి. ఇక స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్ టాప్ ల నుంచి వెలువడే బ్లూ లైట్ నిద్రను నియంత్రించే మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తికి అంతరాయం కలిగిస్తుంది. పడుకునే ముందు స్మార్ట్ ఫోన్లు వినియోగం మీకు నిద్రలేమి సమస్యను సృష్టిస్తుంది.
హాయిగా నిద్ర పోవాలంటే ఇలా చెయ్యండి
హాయిగా నిద్రపోవాలనుకునే వారు కనీసం 30 నిమిషాలు ముందైనా వాటికి దూరంగా ఉండాలి. ఇక నిద్రలేమి సమస్యతో బాధపడేవారు స్థిరమైన నిద్ర వేళలను అలవాటు చేసుకోవాలి. ఇవి మీ మెదడుకు నిద్ర సమయాన్ని సూచించడంతో మెదడు ఆ దిశగా నిద్రకు ఉపక్రమించేలా చేస్తుంది. రాత్రివేళ నిద్రపోయే ముందు గోరువెచ్చని నీళ్లతో స్నానం చేసినా,కాసేపు చదువుకున్న, విశ్రాంతి వ్యాయామాలు చేయడం అలవాటుగా పెట్టుకున్న హాయిగా నిద్ర పడుతుంది.
ఒత్తిడి తగ్గించుకోండి
నిద్రపోయే ముందు కొన్ని ముఖ్యమైన పనులు చేసినా, తీవ్రమైన వ్యాయామం చేసినా లేదా ఒత్తిడితో కూడుకున్న సంభాషణలు విన్న అడ్రినలిన్ స్థాయిలను ఇవి పెంచుతాయి. ఇది నిద్రపోవడాన్ని కష్టతరం చేసి నిద్ర రాకుండా చేస్తాయి. ఇక హాయిగా నిద్రపోవాలనుకునే వారు వీలైనంతవరకు ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ఒత్తిడి ఎక్కువగా ఉంటే యోగా వంటి వాటిని సాధన చేయాలి.
నిద్ర పట్టకుంటే ఇవి చేస్తే పడుతుంది
నిద్రకు ఉపక్రమించి మంచంపై పడుకున్న తర్వాత కూడా నిద్ర పట్టకపోతే లేచి ఏదైనా పుస్తకాన్ని చదవడం, ప్రశాంతమైన సంగీతాన్ని వినడం లేదా ధ్యానం చేయడం చాలా ఉత్తమం. ఇలా చేస్తే మైండ్ ప్రశాంతంగా ఉండి నిద్ర పట్టే అవకాశం ఉంటుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications