భోజనం చేసి రెండు యాలకులు నమిలితే - హైబీపీ, గ్యాస్ సమస్యలకు చెక్..!!
ప్రతీ ఇంటా ఖచ్చితంగా ఉండే మసాలా దినుసు యాలకు. యాలకులను వేస్తే కూరలకు చక్కని రుచి, వాసన వస్తాయి. యాలకులో ఎంతో ఆరోగ్యం ఉంది. శరీరానికి కావాల్సిన పోషకాలతో పాటు గా ఔషధ గుణాలు ఇందులో ఉంటాయి. యాలకులను భోజనం చేసిన తరువాత నోట్లో వేసుకుని నమిలితే ఆరోగ్య పరంగా ఉండే ప్రయోజనాలను పలు పరిశోధనల్లో వెల్లడించారు. ఇందులో ఉంే కార్మినేటివ్ గుణాలు జీర్ణాశయ సమస్యలను తగ్గిస్తాయి. అదే విధంగా గుండె.. నోటి సమస్యలకు యాలకులు మేలు చేస్తాయని పరిశోధనలు వెల్లడించాయి.
యాలకు ప్రతీ రోజు అన్నం తిన్న తరువాత రెండు నమిలితే ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. అందులో కార్మినేటివ్ గుణాలు ఉంటాయి. దీంతో గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. యాలకులను తినడం వల్ల జీర్ణాశయ ఎంజైమ్‌లు ఉత్పత్తి అవుతాయి. ఇవి జీర్ణ క్రియను మెరుగు పరుస్తాయి. యాలకులను తింటుంటే అజీర్తి, గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, పొట్టలో అసౌకర్యం, వికారం, వాంతికి వచ్చినట్లు ఉండడం వంటి సమ స్య ల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే వీటి ద్వారా వచ్చే నోటి దుర్వాసన కూడా తగ్గిపో తుంది. యాలకుల్లో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ముఖ్యంగా ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మన శరీరంలో ఉండే ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి, అంతర్గతంగా ఉండే వాపులు తగ్గిపోతాయి.

యాలకుల్లో ఉండే ఫ్లేవనాయిడ్స్ - ఫినోలిక్ ద్వారా కణాలకు నష్టం లేకుండా నివారించే అవకాశం ఉంటుంది. తద్వారా గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా ఉంటాయి. బీపీని నియంత్రించడంలో యాలకులు అద్భుతంగా పనిచేస్తాయని పరిశోధనల్లో వెల్లడైంది. వీటి ల్లో డై యురెటిక్ గుణాలు ఉంటాయి. ఇవి రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. రోజూ యాలకు ల ను తినడం వల్ల హైబీపీ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. యాలకుల్లో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు సైతం ఉంటాయి. అందువల్ల వీటిని రోజూ తింటుంటే శరీరంలోని నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. వీటిల్లో ఉండే యాంటీ మైక్రోబియల్, యాంటీ సెప్టిక్ గుణాల కారణంగా నోట్లో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. నోటి దుర్వాసన తగ్గిపోతుంది. దంతాలు, చిగుళ్లు, నోరు ఆరోగ్యంగా ఉంటాయి.












Click it and Unblock the Notifications