రెగ్యులర్ గా జీడిపప్పు తింటున్నారా..? అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!!

డ్రై ఫ్రూట్స్‌ లో జీడిపప్పుకు ప్రత్యేక స్థానం ఉంది. జీడిపప్పులో అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా కేలరీలు ఎక్కువ. ప్రోటీన్లు, ఫైబర్ కూడా మెండుగా ఉంటుంది. ఆరోగ్య కరమైన కొవ్వులు ఉంటాయి. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కొందరు బరువు తగ్గే ప్రయత్నాలలో జీడిపప్పును తింటే.. మరికొందరు బరువు పెరగడం కోసం తింటుంటారు. అసలు జీడిపప్పు తింటే బరువు తగ్గుతారా లేగా పెరుగుతారా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. దీని గురించి ఆహార నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.

జీడిపప్పు చాలా రుచికరమైన డ్రై నట్స్ లో ఒకటి. జీడిపప్పు జోడించిన వంటకాలు అదనపు రుచితో ఇంకా తినాలనిపించేలా చేస్తాయి. స్వీట్ల నుండి మసాలా వంటల వరకు.. చాలా రకాలుగా జీడిపప్పును తింటారు. ఆరోగ్యకరమైన డైట్ ఫాలో అయ్యేవారు రోజులో కొన్ని జీడిపప్పులు తప్పనిసరిగా తింటూ ఉంటారు. అయితే జీడిపప్పు తీసుకునే పరిమాణం బట్టి, తీసుకునే విధానం బట్టి బరువు పెరిగేలాగా, తగ్గేలాగ కూడా చేస్తుంది. బరువు పెరగాలని అనుకునే వారు జీడిపప్పును నేరుగా కంటే వేయించి ఉప్పు జోడించిన జీడిపప్పు తినాలి. ఇలా తింటే ఆకలి, దాహం పెరుగుతాయి. ఇది ఆహారం తీసుకోవడాన్ని ప్రేరేపిస్తుంది. జీడిపప్పులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని రోజులో కొంచెం ఎక్కువగా తిన్నా బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాగా.. బరువు తగ్గాలనుకునే వారు జీడిపప్పును తీసుకుంటారు. జీడిపప్పు చాలా ఆరోగ్యకరమైన స్నాక్స్ గా పనిచేస్తుంది.

 సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్..!!
సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్..!!
cashews-are-rich-in-nutrients-and-may-offer-several-health-benefits-such-as-promoting-heart-health

పరిమితంగా తీసుకుంటే ప్రయోజనాలు

జీడిపప్పును పరిమిత మోతాదులో స్నాక్స్ సమయంలో తీసుకుంటే ఇతర అనారోగ్యకరమైన చిరుతిండ్లు తినకుండా నివారిస్తుంది. వీటిలో ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఇది ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న ఫీల్ ఇస్తుంది. బరువు తగ్గాలని అనుకునేవారు స్నాక్స్ సమయంలో పరిమిత మోతాదులో జీడిపప్పు తినడం సహాయపడుతుంది. బరువు తగ్గాలని అనుకునేవారు జీడిపప్పును వేయించి కాకుండా సాధారణంగా లేదంటే రాత్రి నానబెట్టి ఉదయాన్నే తీసుకోవచ్చు. కానీ వేయించి, ఉప్పు, కారం వంటివి జోడించిన జీడిపప్పును మాత్రం తీసుకోకూడదు. వీటిలో కేలరీలు ఉంటాయి కానీ వేయించిన ప్రక్రియ కారణంగా ఆరోగ్యకరమైన కొవ్వులు తగ్గిపోతాయి. సోడియం కంటేంట్ కూడా బరువు పెరగడానికి దారి తీస్తుంది. సాధారణంగా రోజుకు 5 నుంచి 10 జీడిపప్పులు తినడమే సరిపోతుంది. కొవ్వులు ప్రోటీన్ ఎక్కువ అవసరమైన వాళ్ళు 15 నుంచి 30 వరకు కూడా తీసుకోవచ్చు. కానీ బరువు పెరుగుతారనే ఆలోచన ఉంటే డైటీషియన్ సలహా తీసుకున్న తర్వాతే తినాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+