చూడ్డానికి కొత్తిమీరలా కనిపిస్తోంది గానీ- ఇది సూఫర్ ఫుడ్.. !!

ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు ప్రాధాన్యం రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలోనే అనేక రకాల ఆకుకూరలు, కూరగాయలు మన దైనందిన జీవితంలో భాగమవుతున్నాయి. అలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సెలరీ గురించి. దీని శాస్త్రీయ నామం అపియమ్ గ్రావియోలెన్స్. చూసేందుకు మన కొత్తిమీర కాడల్లా ఉండే సెలరీ.. చలవ చేసే గుణాలతో పాటు అద్భుతమైన పోషక విలువల గని.

తక్కువ కేలరీలు, నీటి శాతం ఎక్కువగా ఉండే ఈ సెలెరీని ఆధునిక జీవన శైలిలో సూపర్ ఫుడ్‌గా చెప్పుకోవచ్చు. ఇందులో దాదాపు 95 శాతం నీరు ఉంటుంది. అందువల్ల ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే రోజుల్లో శరీరాన్ని కాపాడుకోవడానికి, డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి ఇది ఎంతగానో సాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికీ సెలరీ ఓ అద్భుతమైన ఎంపిక. ఇందులో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది.

Celery Health Benefits Antioxidants Fiber and Anti-Inflammatory Power Low-Calorie Crunch Keeps

దీనివల్ల కొద్ది పరిమాణంలో తిన్నా ఎక్కువ సమయం కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఫలితంగా అతిగా తినే అలవాటు క్రమంగా అదుపులోకి వస్తుంది. పైగా కేలరీలు కూడా చాలా తక్కువ. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు శరీరానికి మైక్రోన్యూట్రియెంట్లతో పాటు పీచు పదార్థం ఎంతో అవసరం. సెలరీలో ఉండే సహజ సిద్ధమైన ఫైబర్.. మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధికి తోడ్పడుతుంది.

చుక్కలు చూపిస్తోన్న నిత్యావసర సరుకుల ధరలు: కేంద్రం తాజా నివేదిక విడుదల
చుక్కలు చూపిస్తోన్న నిత్యావసర సరుకుల ధరలు: కేంద్రం తాజా నివేదిక విడుదల

గుండె పనితీరును మెరుగుపరచడంలో ఇది కీలకమైన పాత్ర పోషిస్తుంది. దీనిలోని పొటాషియం బీపీ స్థాయిని క్రమబద్ధీకరిస్తుంది. ఇందులో ఉండే థాలైడ్స్.. రక్తనాళాలను శుభ్రపరుస్తాయి. ఫలితంగా రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను సైతం నియంత్రిస్తుంది. ఇందులో విటమిన్ ఎ, సీ, కే వంటి విటమిన్లతో పాటు శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. అపిజెనిన్, ల్యుటియోలిన్ వంటి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తాయి.

మొహసిన్ నఖ్వీ.. త్వరలో ఇంటికి: BCCI దెబ్బకు.. !!
మొహసిన్ నఖ్వీ.. త్వరలో ఇంటికి: BCCI దెబ్బకు.. !!

కీళ్లనొప్పులు, ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలతో ఇబ్బంది పడేవారికి ఇది సహజ సిద్ధమైన ఉపశమనాన్ని ఇస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలోనూ ఇది చురుగ్గా పనిచేస్తుంది. ఇందులోని విటమిన్ కే.. ఎముకలను దృఢంగా మార్చడానికి తోడ్పడుతుంది. వీటి కాడలను సలాడ్‌, జ్యూస్‌, లేదా సూప్‌ రూపంలో కూడా తీసుకోవచ్చు.

ప్రతి ఒక్కరి శారీరక తత్వం వేరుగా ఉంటుంది. ఏదైనా కొత్త ఆహారాన్ని అలవాటు చేసుకునే ముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవాలి. కొంతమందిలో ఇది స్కిన్ అలర్జీలకి దారి తీస్తుంది. రక్తాన్ని పలచబరిచే మందులు బీపీ టాబ్లెట్లు వాడుతున్న వారు డాక్టర్ల సలహాతోనే దీనిని తీసుకోవాలి. అతిగా తింటే కడుపు ఉబ్బరం లేదా గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+