314 కి.మీ దూరంలోని పాకిస్థాన్ ఎయిర్ క్రాఫ్ట్ ను పేల్చేసిన భారత్.. కేంద్రం సంచలన ప్రకటన

భారత్ కు పొరుగు దేశమైన పాకిస్థాన్ తో ఎప్పుడూ ముప్పు పొంచి ఉంటూనే ఉంది. భారత్ లో నిత్యం దాడులకు పాకిస్థాన్ కుట్రలు పన్నుతూ ఉంటున్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్ కు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా ఆ దేశం మాత్రం భారత్ పై విషం చిమ్ముతూనే ఉంటుంది. గతేడాది ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఈ ఘటన వెనకున్నట్లు తేలిన నేపథ్యంలో మే 7 నుంచి 10 వరకు నాలుగు రోజులపాటు పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది.

పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. అలాగే వందలాది మంది ఉగ్రవాదులను హతమార్చింది. పాకిస్థాన్ ధ్వంసం చేసిన 9 కీలక ఉగ్రవాద స్థావరాల్లో ముజఫరా బాద్ లోని సవాయ్ నాలా క్యాంప్, సిడ్నా బిలాల్ క్యాంప్ అలాగే కోట్లీలోని గుల్ పూర్ క్యాంప్, అబ్బాస్ క్యాంప్, భీంబర్ లోని బర్నాలా క్యాంప్ తో పాటు సియాల్ కోట్ లోని సర్జాల్ క్యాంప్, మెహమూనా జోయా క్యాంప్, మురిద్కే లోని మార్కాజ్ టైబా క్యాంప్, బహావల్ పుర్ లోని మార్కజ్ సుభానల్లా క్యాంప్ లు ఉన్నాయి. వీటిని భారత్ పూర్తిగా ధ్వంసం చేసింది. అయితే సెప్టెంబర్ 13 ఆదివారం రోజున కేంద్ర రక్షణ శాఖ యానువల్ రిపోర్ట్ 2025-26 ను విడుదల చేసింది.

ఆ రిపోర్టులో కీలక విషయాలను వెల్లడించింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ సాధించిన అద్వితీయ విజయాలను అందులో పేర్కొంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్ లోని ఓ ఎయిర్ క్రాఫ్ట్ ను 314 కి. మీ. దూరంలో నుంచే భారత్ కు చెందిన ఎస్-400 డిఫెన్స్ వ్యవస్థ కుప్పకూల్చిందని తెలిపింది. ఇది అతి దూరమైన సర్ఫేస్ టూ ఎయిర్ దాడి అని స్పష్టం చేసింది. ఈ రిపోర్టులో ఎస్-400 డిఫెన్స్ వ్యవస్థ పనితనాన్ని వివరించింది. ఇండియన్ రాడార్లు ఈ ముప్పును సైలెంట్ గా గ్రహించాయని.. సూదూర ప్రాంతం నుంచి పాకిస్థాన్ ఓ ఎయిర్ క్రాఫ్ట్ తో భారత్ కు గురి పెట్టి ఉన్నట్లు తేల్చిందని ఈ క్రమంలో సర్ఫేస్ టూ ఎయిర్ మిసైల్ ఈ టార్గెట్ ను ఛేదించని రిపోర్టులో పేర్కొంది.

S400 India shot down Pakistani aircraft from distance of 314 kilometers during Operation Sindhur

అలాగే మే 12, 2025 న ప్రధాని నరేంద్రమోదీ అదామ్ పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు చేరుకుని ఈ ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేసిన సైన్యాన్ని ప్రత్యేకంగా అభినందించినట్లు రిపోర్టులో పేర్కొంది. అంతేకాక ఆగస్టు 15,2025 రోజున 219 మంది ఎయిర్ ఫోర్స్ సైన్యానికి ప్రెసిడెన్షియల్ గ్యాలంట్రీ అవార్డులను అందించినట్లు వివరించింది. ఇక ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ లోని ప్రార్థనా స్థలాలు, మెడికల్ స్థావరాలు, పాఠశాలలు, పౌరుల మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులను చేపట్టింది. అయితే ఆ దాడులను భారత్ ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సమర్థవంతంగా అడ్డుకుందని రిపోర్టు స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+