హీరోయిన్‌తో గణపయ్య పూజలో టాలీవుడ్ డైరెక్టర్.. పెళ్లి ఫిక్స్ అయినట్టేనా?
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బా రిలేషన్ షిప్‌లో ఉన్నారంటూ గత కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉండగా.. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబుతున్నారని కూడా వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. గణేష్ చతుర్థి పర్వదినం సందర్భంగా వీరిద్దరూ జంటగా పూజలో పాల్గొన్నారు.
దీనికి సంబంధించిన ఫోటోను తరుణ్ భాస్కర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. అయితే ఆ ఫోటోలో ఆయన పక్కనే హీరోయిన్ ఈషా రెబ్బా ఉండటం విశేషం. ఇంట్లో గణేశుడికి పూజ చేసిన అనంతరం ఈ ఫోటో తీసుకున్నారు. అయితే ఈ పోస్టుకు తరుణ్ భాస్కర్ ఎలాంటి క్యాప్షన్ రాయలేదు. ఈషా రెబ్బా నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. దీంతో వారు తన బంధం గురించి ఇలా హింట్ ఇస్తున్నారని ఫ్యాన్స్ భావిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీంతో వీరిద్దరి పెళ్లి వార్తలపై టాలీవుడ్‌లో మరోసారి జోరుగా చర్చ మొదలైంది.

మరోవైపు తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా ప్రేమలో ఉన్నారని, త్వరలోనే ఒక్కటి కాబోతున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో చాలా సార్లు ఈ ఇద్దరూ ఎయిర్పోర్టులు, షాపింగ్ మాళ్లలో జంటగా కనిపించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఏఆర్ సంజీవ్ దర్శకత్వం వహించిన 'ఓంశాంతి శాంతి శాంతిః' సినిమాలో తరుణ్ భాస్కర్, ఈషా జంటగా నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఇప్పటివరకు ఈ ప్రేమ, పెళ్లి వార్తలపై తరుణ్ భాస్కరా కానీ, ఈషా గానీ ఎప్పుడు స్వయంగా స్పందించలేదు. గతంలో ఓ సందర్భంలో తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. ఈషా తనకు ఫ్రెండ్ కన్నా ఎక్కువని తెలిపారు. సరైన సయయంలో అన్ని విషయాలు వెల్లడిస్తానని కూడా వెల్లడించారు. ఇప్పుడు తరుణ్ భాస్కర్ ఇచ్చిన తాజా హింట్ తో ఆ సరైన సమయం ఆసన్నమైందని.. త్వరలోనే ఈ జంట శుభవార్త చెబుతుందేమోనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
#TharunBhascker shares an insta post with #EeshaRebba after completing #VinayakaChavithi pooja..
— telugucinema.com (@thetelugucinema) September 14, 2026
Hinting for something special soon pic.twitter.com/WAyydCZ0GV













Click it and Unblock the Notifications
