గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం పాప్ స్మియర్ టెస్ట్.. ఎప్పుడు చేయించుకోవాలి?
ప్రస్తుతం మహిళలు ఎదుర్కొంటున్న వ్యాధులలో అత్యంత భయంకరమైనది క్యాన్సర్. దేశంలో చాలామంది స్త్రీలు ప్రస్తుతం క్యాన్సర్ బారినపడి చిన్న వయసులోనే ప్రాణాలను కోల్పోతున్నారు. అయితే క్యాన్సర్ ను మొదటి దశలోనే గుర్తిస్తే దానిని ఆపడానికి వీలు కలుగుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం బ్రెస్ట్ క్యాన్సర్ తో పాటు సర్వైకల్ క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.
కాబట్టి సర్వైకల్ క్యాన్సర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. సర్వైకల్ క్యాన్సర్ విషయంలో కచ్చితంగా మహిళలు పాప్ స్మియర్ టెస్ట్ చేయించుకోవాలి. పాప్ స్మియర్ టెస్ట్ అనేది గర్భాశయ క్యాన్సర్ కు సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్. గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది మహిళల ఆరోగ్య సంరక్షణలో ముఖ్యమైన భాగం కాబట్టి సెక్స్ లో పాల్గొనడం ప్రారంభించిన వయసు నుండి స్క్రీనింగ్ చేయించుకోవాలి.

అయితే మహిళలు ఎప్పుడు గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలైన పాప్ స్మియర్ టెస్ట్ చేసుకోవాలి అనేది వారి వయస్సు మరియు వారి ఆరోగ్య చరిత్రను బట్టి ఆధారపడి ఉంటుంది. 21సంవత్సరాల నుండి 29సంవత్సరాల వయసు గల స్త్రీలు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పాప్ స్మియర్ పరీక్ష చేయించుకోవాలి. ఇక 30 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలు వయసుగల మహిళలకు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పాప్ స్మియర్ చేయించుకోవాలి.
అయితే సెక్స్ లో తరచుగా పాల్గొనని మహిళలు ఐదు సంవత్సరాలకు ఒకసారి పరీక్షలు చేయించుకోవచ్చు. సెక్స్ లో తరచూ పాల్గొనేవారు ఏదైనా అనుమానం కలిగినా పాప్ స్మియర్ పరీక్ష చేయించుకోవచ్చు. పాప్ స్మియర్ పరీక్ష చేయించుకోవడం వల్ల ఒకవేళ క్యాన్సర్ సంబంధిత లక్షణాలు ఉంటే ప్రాథమిక దశలోనే చికిత్స చేయడానికి వీలవుతుంది. పాప్ స్మియర్ పరీక్ష చేయించుకోవడం వల్ల గర్భాశయ ఆరోగ్యం మనకు తెలుస్తుంది.
దీనివల్ల గర్భాశయ క్యాన్సర్ బారి నుండి కాపాడే అవకాశం ఉంటుంది. పాప్ స్మియర్ స్క్రీనింగ్ పరీక్ష 70 శాతం గర్భాశయ క్యాన్సర్ మరణాలను నిరోధిస్తుందని అనేక అధ్యయనాలు తేల్చాయి. ఇది క్యాన్సర్ ని గుర్తించే పరీక్ష కాదు. క్యాన్సర్ కు సంబంధించిన కణాలు ఏవైనా గర్భాశయ ముఖద్వారంలో ఉంటే వాటిని గుర్తించి హెచ్చరించే పరీక్ష.
HPV కారణంగా గర్భాశయంలో సెల్యులర్ మార్పులను గుర్తించడం పాప్ స్మియర్ పరీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి గర్భాశయ క్యాన్సర్ రాకముందే పాప్ స్మియర్ టెస్ట్ తో స్క్రీనింగ్ చేసుకొని దానిని రాకుండా అడ్డుకోండి.సర్వైకల్ క్యాన్సర్ కు చెక్ పెట్టాలంటే ముందు దానిపై అవగాహనే ముఖ్యం.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications