చియా సీడ్స్ తీసుకున్న ఆ తరువాత ఆ పని చేయకపోతే కష్టం

ప్రస్తుతం చియా సీడ్స్ చాలామంది ఆహారంలో ఒక భాగంగా మారాయి. పోషకాల విషయంలో వీటిని సూపర్ ఫుడ్‌ గా చెప్పుకోవచ్చు. చాలా సులభంగా ఎలాంటి ఆహారంలోనైనా కలుపుకోవచ్చు. గ్రానోలా, స్మూతీస్, పుడ్డింగ్, సలాడ్ డ్రెస్సింగ్, మఫిన్స్, చియా వాటర్ వంటి వాటిలో కూడా వీటిని ఉపయోగించవచ్చు. చియా గింజలను ప్రతిరోజూ తినడం మంచిదేనా? అనే విషయంపై డైటీషియన్లు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

చియా గింజలు అంటే ఏమిటి?

చియా సీడ్స్.. ఆస్ట్రేలియా, లాటిన్ అమెరికా, దక్షిణ అమెరికా ప్రాంతాలలో పెరిగే చియా మొక్క నుండి వస్తాయి. చియా సీడ్స్ నీటిని పీల్చుకుని వాటి పరిమాణం కంటే 10 నుండి 12 రెట్లు ఎక్కువగా వ్యాకోచిస్తాయి. వీటి ప్రత్యేకత ఇదే. నీటిలో కరిగే ఫైబర్ అధికంగా ఉండటం వల్లే ఈ సీడ్స్ ఇలా వ్యాకోచిస్తాయి.

అందుకే చియా సీడ్స్ మొక్కల ఆధారిత లేదా పాల పదార్థాలను చిక్కగా చేసి క్రీమీ పుడ్డింగ్‌గా మారుస్తాయి. చియా సీడ్స్ లలోని ఫైబర్ కారణంగానే ఇవి బరువు తగ్గడానికి, మలబద్ధకం నివారణకు సహాయపడతాయి.

చియా గింజల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

చియా గింజల్లో అనేక ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ప్రతి పోషకం దాని స్వంత ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

చియా గింజలను ప్రతిరోజూ తినడం సురక్షితమేనా?

చియా గింజలను ప్రతిరోజు తినడం సురక్షితమే అయినప్పటికీ, వాటిని తిన్నప్పుడు తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. "ఫైబర్ సాధారణంగా ఆరోగ్యానికి మంచిదే, కానీ ఎక్కువ ఫైబర్ తింటే కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి" అని డాక్టర్ బియాస్ హెచ్చరించారు.

"ఎక్కువ ఫైబర్ తీసుకుని తగినంత నీరు తాగకపోతే మలబద్ధకం మరింత తీవ్రమవుతుంది.. అని ఆయన అన్నారు. చియా గింజల్లోని కరిగే ఫైబర్ జీర్ణవ్యవస్థ నుంచి నీటిని గ్రహిస్తుంది. గింజలు కడుపులో వ్యాకోచిస్తాయి. కాబట్టి తగినంత నీరు తాగడం ద్వారా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. రోజుకు కనీసం 64 ounces (8 కప్పులు) నీరు తాగాలని డాక్టర్ బియాస్ సూచిస్తున్నారు.

నానబెట్టిన చియా గింజలను ఒక టేబుల్ స్పూన్ కంటే ఎక్కువ తీసుకోకూడదని డైటీషియన్ సాసెడా సూచిస్తున్నారు. ఒకవేళ పొడి చియా గింజలను తింటే ఒక టీస్పూన్ మాత్రమే తీసుకోవాలని ఆమె అన్నారు. ప్రేగు సిండ్రోమ్, డైవర్టికులోసిస్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు చియా గింజలను తీసుకోవడం వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తగినంత నీటీని తీసుకోవడం వల్ల చియా సీడ్స్ నుంచి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని అన్నారు.

చియా గింజలతో ఏమి తయారు చేయాలి?

చియా పుడ్డింగ్, స్మూతీస్ కాకుండా చియా గింజలను ఉపయోగించడానికి మరికొన్ని మార్గాలు ఉన్నాయి. ఎనర్జీ బాల్స్ లేదా గ్రానోలా బార్స్- ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వుల పరిమాణాన్ని పెంచడానికి మీకు ఇష్టమైన వంటకానికి ఒక టీస్పూన్ చియా గింజలను కలపండి.

బ్రెడ్: చియా గింజలను బ్రెడ్‌లో కలిపి కాల్చి, శాండ్‌విచ్‌లు లేదా ఉదయం అల్పాహారంగా తీసుకోవచ్చు.

చియా సీడ్ ఫ్లోర్: చియా సీడ్స్ ను పిండిలా చేసి, దానితో చపాతి వంటి వివిధ రకాల వంటలు చేసుకోవచ్చు.

క్రంచీ టాపింగ్: సలాడ్లు, పెరుగు, నిమ్మరసం వంటి ద్రవపదార్థల్లో చియా సీడ్స్ ను కలపవచ్చు.

ముగింపు

చియా గింజలు చాలా మందికి సురక్షితమే అయినప్పటికీ వాటిని తినేటప్పుడు తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. చియా గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనివల్ల ఒకేసారి ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+