ఖాళీ కడుపుతో టీ/కాఫీకి బదులుగా దీన్ని తాగి చూడండి.. జస్ట్ ఫర్ ఛేంజ్
లవంగాన్ని నానబెట్టిన లేదా మరిగించిన నీరు.. చర్మ ఆరోగ్యానికి శక్తివంతమైన హోమ్ మెడిసిన్. యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇందులో అధికం. ఆరోగ్య నిపుణులు దీనిని మితంగానే వాడాలని సూచిస్తున్నారు. ఆరోగ్యపరంగా ఇది పలు ప్రయోజనాలను అందిస్తుంది. దీన్ని తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అవసరం.
లవంగం నీటిలో 'యూజెనాల్' అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది డెడ్ స్కిన్, నల్ల మచ్చలు, త్వరగా ముడుతలు పడటానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. దీన్ని రోజూ వాడటం వల్ల ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించవచ్చు. చర్మం నిగారింపునకు ఇది సహాయపడుతుంది. యాంటీ-బాక్టీరియల్, యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల లవంగం నీరు మొటిమలను లోపలి నుండి తగ్గిస్తుంది. ఇది బాక్టీరియా వృద్ధిని నియంత్రిస్తుంది. మంటను తగ్గిస్తుంది. తద్వారా చర్మ స్వచ్ఛతను పెంచుతుంది. మొటిమల సమస్య ఉన్నవారికి బ్రేకౌట్లు తగ్గొచ్చు.

ఆరోగ్యకరమైన చర్మం కావాలంటే.. జీర్ణవ్యవస్థ బాగుండటం ముఖ్యం. లవంగం నీరు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. శరీరం వ్యర్థాలను చెమట/మూత్రం రూపంలో బయటికి పంపిస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ చర్మపు దద్దుర్లను తగ్గించి, సమతుల్యమైన, తాజాగా కనిపించే రూపాన్ని ఇస్తుంది. అలాగే- శరీర జీవక్రియను మెరుగుపరి సామర్థ్యం లవంగాన్ని నానబెట్టిన/మరిగించిన నీటికి ఉంది.
సహజ ప్రక్రియలను సమతుల్యం చేయడం ద్వారా ఇది అధిక కొలెస్ట్రాల్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. ఆయిలీ లేదా డ్రై స్కిన్, మూసుకుపోయిన రంధ్రాల సమస్యలతో బాధపడేవారికి ఇది ప్రయోజనకరం. చర్మం జిడ్డు లేకుండా తాజాగా ఉంటుంది. లవంగం నీటిలోని యాంటీఆక్సిడెంట్లు లోపలి నుండి పిగ్మెంటేషన్, నల్ల మచ్చలను తగ్గించగలవు. క్రమం తప్పకుండా పరిమితంగా వాడటం ద్వారా చర్మపు రంగు మరింత నిగారింపును సంతరించుకుంటుంది. మచ్చలు తగ్గుతాయి. చర్మానికి సహజమైన ప్రకాశాన్ని అందిస్తుంది.
లవంగం నీటిని ఎక్కువగా వాడకూడదు. దీనివల్ల ఎసిడిటీ సమస్య తలెత్తవచ్చు. నోటిలో తేలికపాటి పుండ్లు, అలర్జీ వంటి రియాక్షన్లు తలెత్తే అవకాశం ఉంది. యూజెనాల్ వల్ల కాలేయ పనితీరు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ఎసిడిటీ, అల్సర్లు, కాలేయ సమస్యలు ఉన్నవారు లేదా గర్భిణీలు డాక్టర్ల సలహా లేకుండా ఈ నీటిని తీసుకోకూడదు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండాలంటే రోజుకు ఒక గ్లాసు (150-200 మిల్లీ లీటర్లు) తేలికపాటి లవంగం నీటిని ఉదయం పూట తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువ గాఢతతో కూడిన నీటిని తీసుకోకూడదు.












Click it and Unblock the Notifications