రోజుకు ఎన్ని కప్పుల కాఫీ తాగుతున్నారు.. వీరికి మోతాదు మించితే..!?
కాఫీ ప్రేమికులు ప్రత్యేకంగా ఉంటారు. ఉదయం నిద్ర లేవగానే చాలా మంది కాఫీ లేదా టీ సేవిస్తుంటారు. కాఫీని రోజూ పరిమిత మోతాదులో తాగితే ఆరోగ్యకరమైన ప్రయోజనాలే కలుగు తాయి. రోజూ కాఫీని తాగడం వల్ల పలు వ్యాధులను నయం చేసుకోవచ్చని, మన శరీరానికి పలు రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల కాఫీని రెండు వారాల పాటు నియమితంగా తీసుకుంటే శరీరంపై పలు సానుకూల ప్రభావాలు కనిపిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. కాఫీ వలన ఆరోగ్య పరమైన ప్రయోజనాల పైన పలు నివేదికలు ఉన్నాయి.
కాఫీ తీసుకొనే వారి ఒక సారికే పరిమితం అవ్వరు. చాలా మంది రోజు మొత్తంలో ఎక్కువ సార్లు కాఫీ తీసుకోవటం అలవాటుగా మార్చుకుంటున్నారు. కాఫీ కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నియమితంగా కాఫీ తాగడం వల్ల ఫ్యాటీ లివర్, ఫైబ్రోసిస్, సిర్రోసిస్ వంటి సమస్యల ప్రమాదం తగ్గుతుంది. దీని వల్ల లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. అదే విధంగా కాఫీ మెటబాలిజాన్ని మెరుగు పరుస్తుంది. ఇందులో ఉండే క్లోరోజెనిక్ ఆమ్లాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి శరీరంలోని మెటబాలిక్ ప్రక్రియలను సమర్థవంతంగా అమలు చేయడంలో సహాయపడతాయి. మెదడు పనితీరును ఉత్తేజపరుస్తుంది. కాఫీలోని కెఫీన్ అలర్ట్‌నెస్, దృష్టి, మానసిక పనితీరును పెంచి మెదడు సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో కాఫీ సహాయపడుతుంది.

నిపుణుల సూచనలు.. పరిమితి మేరకు తీసుకుంటే
కాఫీ తీసుకోవటం ద్వారా ఇది పెద్దపేగును ఉత్తేజపరచి గట్ మొటిలిటీని పెంచడం ద్వారా జీర్ణ ప్రక్రియను సులభతరం చేస్తుంది. అయితే కాఫీ వినియోగంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. IBS లాంటి సమస్యలు ఉన్నవారు కాఫీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా పెద్దలకు రోజుకు ఒకటి నుంచి రెండు కప్పుల బ్లాక్ కాఫీ సరిపోతుంది. కానీ గుండె దడ, ఆందోళన, ఆమ్లత్వం లేదా నిద్ర సమస్యలు ఉంటే కాఫీని తగ్గించడం లేదా మానేయడం మంచిది. కాఫీలో అధికంగా చక్కెర లేదా ప్రాసెస్ చేసిన క్రీమ్‌లను కలపడం ఆరోగ్యానికి హానికరం. వీటిని తగ్గించడం అవసరం. సరైన పరిమాణంలో, సరైన విధంగా తీసుకుంటే కాఫీ శరీరానికి పలు ప్రయోజనాలు అందుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.













Click it and Unblock the Notifications