టీ vs కాఫీ...ఎవరికి ఏది మేలు చేస్తుంది..!!
ప్రతీ ఇంటా కాఫీ..టీ సహజంగా ఉంటాయి. ఉదయం, సాయంత్రం సమయంలో దాదాపుగా అందరి ఇళ్లల్లో వీటిని ఎక్కువగా సేవిస్తారు. జీవన శైలిలో ఈ రెండు ఒక భాగంగా మారిపోయాయి. ఉదయాన్నే టీ లేదా కాఫీ తాగితే వెంటనే మైండ్ రీఫ్రెష్ అవుతుందని చాలా మంది భావిస్తారు. అయితే, కాఫీ, లేదా టీ ఏది తాగితే ఆరోగ్యానికి మంచిది అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. ఎందుకంటే ఇవి రెండు వెర్వేరు ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఇటీవలి ఒక అధ్యయనం టీ - కాఫీ ఆరోగ్య పరంగా ఎవరికి ఏది మంచిదో వెల్లడించింది. ప్రయోజనాలతో పాటుగా దుష్ప్రభావాల గురించి వివరించింది.
ఉదయం సమయంలో టీ లేదా కాఫీ తాగటానికి అలవాటు పడిన వారు ఏ ఒక్క రోజు తాగకుండా ఉండలేరు. ఇలా టీ కాఫీలకు అలవాటు పడటం వెనుక ఏ కారణం ఉన్నా, ఈ రెండిటిలో ఏది బెస్ట్ అనే విషయానికి వస్తే.. టీ కాఫీ రెండింటి ప్రయోజనాల తో పాటుగా దుష్ప్రభావాలు ఉన్నాయి. కాగా, టీ లో ఎల్ థియోనైన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది మన మెదడును స్టిమ్యులేట్ చేస్తుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్ మనలో ఫోకస్, అటెన్షన్, ఆలోచనా శక్తిని పెంచుతుంది. రెగ్యు లర్ గా టీ తాగే వారిలో ఎముకల సాంద్రత ఎక్కువగా ఉండడంతో పాటు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కాఫీలో ఎక్కువగా ఉండే కెఫీన్ వల్ల బరువు తగ్గే వీలుంటుందని నిపుణులు వెల్లడి స్తున్నారు. అందుకే చాలామంది బ్లాక్ కాఫీని వర్కవుట్ ముందు ప్రీ వర్కవుట్‌గా తీసుకుంటూ ఉంటారు. కొవ్వును కరిగించే గుణాలు కాఫీలో ఎక్కువగా ఉంటాయి. అలాగే గుండె జబ్బులు, డయాబెటిస్, పార్కిన్సన్స్ వంటి సమస్యలను కూడా తగ్గించేందుకు కాఫీ దోహదపడుతుంది.

ఆరోగ్య ప్రయోజనాలు
అయితే కాఫీ ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. టీ ఎక్కువగా తాగడం వల్ల ఆహారంలోని ఐరన్ ని తీసుకోవడానికి ఇబ్బంది ఎదురవుతుంది. కాగా, ఆహారం తిన్న తర్వాత టీ తాగడం వల్ల ఆహారంలోని ఐరన్‌ని తీసుకునే శక్తి 62 శాతం మేర తగ్గుతుంది. కాఫీ తీసుకుంటే ఇది కేవలం 35 శాతం మేరకే ఉంటుంది. టీ తో పోల్చితే కాఫీ చాలా ఎసిడిక్ గుణం కలిగి ఉంటుంది. ఫిల్టర్ చేయని కాఫీ వల్ల కొలెస్ట్రాల్ కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. రోజూ నాలుగు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగితే ఎముకల సాంద్రత తగ్గే అవకాశాలుంటాయని విశ్లేషిస్తున్నారు. దీనివల్ల ఎముకలు పెళుసుబారడం, విరగడం వంటి సమస్యలు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. అయితే, కాఫీ వంటి అధిక కెఫిన్ ఉన్న పానీయాలను దూరంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అదేవిధంగా, గర్భవతిగా ఉన్నట్లయితే, తల్లిపాలు ఇస్తున్నట్లయితే, కెఫిన్ తీసుకోవడం పరిమితం చేయటం ద్వారా ఆరోగ్యం పైన ఎలాంటి ప్రభావం ఉండదని చెబుతున్నారు. అయితే, పరిమితంగా తీసుకోవటం ద్వారా సమస్యలు ఉండవని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications