వేసవిలో ఎక్కువగా ఫ్రిజ్ వాటర్ తాగుతున్నారా - అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!!
ఎండాకాలం వచ్చిందంటే చాలా మంది కూల్ వాటర్ తాగుతుంటారు. ఆఫీసులు, బైట నుంచి రాగానే నేరుగా ఫ్రిజ్ ల దగ్గరకు వెళ్లి చల్లని నీళ్లు తాగుతుంటారు. చల్లని నీళ్లు తాగడం వల్ల.. జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. ఫ్రిజ్ లో బాటిళ్లలో చల్లని నీళ్లు నింపేసి, ఎంత కూల్ గా ఉన్న కూడా అవే నీళ్లను తాగుతుంటారు. చల్లని నీళ్లను ఎక్కువగా తాగడం వల్ల తమ గుణాలను కోల్పోతాయి. క్రమంగా గ్యాస్ట్రిక్ సమస్య కూడా ఏర్పడుతుంది. ఇది ఇమ్యునిటిపై కూడా ప్రభావం చూపిస్తుంది. అయితే, వేసవిలో ప్రిజ్ నీరు తాగటం పైన నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు.
వేసవి లో శరీరం డీ హైడ్రేట్ కాకుండా చూసుకోవటం చాలా అవసరం. ఇందు కోసం తగినంత నీరు తీసుకోవాలి. మండే ఎండల్లో పదే పదే గొంతు ఎండుకుపోతూ ఉంటుంది. ఇప్పుడు దాదాపు ప్రతి ఇంట్లో ఫ్రిజ్ ఉపయోగిస్తుండటం వల్ల మరో ఆలోచన చేయకుండా కూలింగ్ వాటర్ తాగేస్తున్నారు. ఫ్రిజ్‌లో కూలింగ్ చేసిన నీరు ఎండాకాలంలో తాగితే ఏం కాదని చాలామంది అభిప్రాయం. కాగా, మనకు సరిపడతాయో లేదో తెలుసుకోకుండా ఫ్రిజ్ నీళ్లు తాగితే ఈ కింది దుష్ప్రభావాలు తప్పవు. ఫ్రిజ్ లో నీటిని రెగ్యులర్ గా తీసుకోవటం వలన మలబద్ధకం, అజీర్తి సమస్యలు రావచ్చు. మనకు తెలియని అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నప్పుడు కూలింగ్ వాటర్ మరింత హానికరంగా మారుతుంది. శరీరంలో నిల్వ ఉన్న కొవ్వుకు చల్లటి నీరు తోడైతే కొవ్వు శాతం మరింత పెరుగుతుంది. చల్లటి నీరు కొంతమందికి అస్సలు సరిపోదు. అలాంటివారికి తాగిన వెంటనే గొంతు నొప్పిగా రావచ్చు. అప్పటికే గొంతు నొప్పి లేదా మరేదైనా సమస్య ఉన్నవారు చిల్లింగ్ వాటర్ తాగకపోవడమే మేలు.

కోల్డ్ వాటర్ ఎక్కువగా తీసుకుంటే.. జరిగేది ఇదే
అదే విధంగా కొందరికి పదే పదే తలనొప్పి వస్తూ ఉంటుంది. ఇలాంటి వారు చల్లటి నీటిని తాగితే మెదడు స్తంభించిపోయే ప్రమాదముంది. కూలింగ్ వాటర్ వెన్నెముకలోని సున్నితమైన నరాలను చల్లబరిచి మెదడుపై ప్రభావం పడుతుంది. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలి. తీవ్రమైన ఎండల్లో చల్లని నీరు తాగాలనే కోరిక కలిగిన వెంటనే నియంత్రించుకునేందుకు ప్రయత్నించండి. చల్లటి నీరు రక్త నాళాలు వ్యాకోచించేలా చేస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి ప్రమాదం. ఫ్రిజ్ నీళ్లు తాగిన ప్రతి ఒక్కరికీ పై సమస్యలు వస్తాయని చెప్పటం లేదంటున్న నిపుణులు.. రెగ్యులర్ గా తీసుకోవటం ద్వారా దీర్ఘకాలంలో దుష్ఫ్రభావం చూపుతుందని చెబుతున్నారు. ఫ్రిజ్ వాటర్ తాగిన తరువాత శరీరంలో ఏదైనా సమస్య ఉన్నట్లు గుర్తిస్తే.. దూరంగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు.
-
అమెరికాకు అనూహ్య షాక్..! చర్చల కోసం ఇరాన్ 4 షరతులు..! -
Hormuz: హార్ముజ్ లో సీమైన్స్ కనిపెట్టలేం..! చర్చల వేళ బాంబుపేల్చిన ఇరాన్..! -
ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే! -
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్











Click it and Unblock the Notifications