పరగడుపున ఈ నీళ్ళను తాగితే... షుగర్ తో పాటు వంద రోగాలకు స్వస్తి!

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యంగా ఉండాలి అనుకునేవారు ప్రతిరోజు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే దినుసులను గురించి తెలుసుకొని వాటిని ఉపయోగించాలి. అలా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే వాటిలో మెంతులు ఒకటి. మెంతులను రాత్రి నీళ్లలో నానబెట్టి తెల్లవారుజామున తాగితే అనేక అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. మెంతులు మీ డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుంది. బరువు పెరగకుండా నిరోధిస్తుంది. మీ ఆకలిని అదుపులో ఉంచుతుంది. మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది.

మెంతి గింజల నీటితో ఆరోగ్యం
ప్రతిరోజు ఒకటి నుంచి రెండు టీ స్పూన్ల మెంతి గింజలను రాత్రిపూట నానబెట్టి పరగడుపున తాగితే మీ జీవక్రియ వేగవంతం కావడమే కాకుండా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రించేలా చేస్తుంది. ప్రతిరోజు ఉదయం పరగడుపున మెంతి గింజల నీళ్లను తాగితే జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. ఫైబర్ జీర్ణవ్యవస్థలోని ఆహార కదలికలను ప్రోత్సహించడంతోపాటు మలబద్ధకాన్ని నివారిస్తాయి.

Control your diabetes cholesterol with fenugreek water every morning with empty stomach

బరువును తగ్గించే మెంతి గింజల నీళ్ళు
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడమే కాకుండా డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచుతుంది. మెంతి గింజల నీరు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది .మెంతి గింజలలో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి, గుండె జబ్బులను నివారించడానికి ఉపయోగపడుతుంది. మెంతి గింజల నీళ్లు మన బరువును తగ్గించడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. ఇది మనకు కడుపు నిండిన భావనను కలిగించి అధిక ఆహారం తీసుకోకుండా చేస్తుంది.

మెంతి గింజల నీళ్లతో రోగ నిరోధక శక్తి
మెంతి గింజల నీళ్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మెంతి గింజలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు మొటిమలు లేదా మచ్చలను తగ్గించడంలో సహాయ పడతాయి. మెంతి గింజల నీళ్లు రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు, శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్ధ్యాన్ని పెంచుతాయి. ఇది నొప్పులను, వాపులను తగ్గిస్తుంది. ఆర్థరైటిస్ వంటి లక్షణాలను తగ్గించడానికి కూడా మెంతి గింజల నీళ్లు ఉపయోగపడతాయి.

మెంతి గింజల నీళ్ళతో జుట్టుకు ఆరోగ్యం
మెంతి గింజలు నీళ్లు గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. మహిళలలో రుతు సమస్యలను తగ్గిస్తాయి. జుట్టు పెరుగుదలకు మెంతి గింజల నీళ్లు ఉపయోగపడతాయి. మెంతి గింజలు ప్రోటీన్, నికోటినిక్ ఆమ్లానికి మంచి మూలం. ఇవి జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మెంతి గింజల నీళ్లు తాగడం వల్ల ఇది జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+