కార్పో'రేట్' వైద్యం.. సంక్షోభంలో ఆరోగ్యం..పట్టించుకునే వారెవరు?

వైద్యో నారాయణో హరి అంటారు. అంటే వైద్యుడు ఆ విష్ణుమూర్తితో సమానం. ధన్వంతరి వారసులుగా రోగాలతో బాధపడే వారికి సేవ చేయాల్సిన వైద్యులు ప్రస్తుతం కార్పొరేట్లుగా వైద్యాన్ని వ్యాపారం చేశారు. ఆసుపత్రికి వెళ్లిన దగ్గర నుండి, ఆసుపత్రి నుండి బయటకు వచ్చేవరకు డాక్టర్ అపాయింట్మెంట్ నుండి, టెస్టులు, మందులు ఇలా అన్నిటితోను వ్యాపారమే చేస్తున్నారు.

కార్పోరేట్ ఆస్పత్రుల్లో సామాన్యుల జేబులు గుల్ల
సామాన్యులు ప్రైవేట్ ఆసుపత్రికి వెళితే జేబులు గుల్ల అవ్వడం తప్ప, వారికి చేకూరే ప్రయోజనం పెద్దగా కనిపించడం లేదు. ఇంకా నిబద్ధతతో పని చేస్తున్న వైద్యులు ఉన్నారు, కాబట్టి సమాజంలో చాలా మంది రోగాల నుండి బయటపడి ఆరోగ్యంగా జీవిస్తున్నారు. కానీ ఇదే సమయంలో పవిత్రమైన వైద్య వృత్తిలో కొనసాగుతూ కేవలం దోపిడీయే లక్ష్యంగా పెట్టుకుని ట్రీట్మెంట్ చేస్తున్న వైద్యులు కూడా లేకపోలేదు.

Corporate hospitals treatment for earning money public Health in a crisis Who cares

కార్పోరేట్ వైద్యంలో ప్రతీ దానికో రేటు
ఒక సామాన్యమైన వ్యక్తి అనారోగ్యంతో ఒక డాక్టర్ దగ్గరికి వెళితే, డాక్టర్ అపాయింట్మెంట్ ఫీజు ఆ డాక్టర్ కి ఉన్న పేరును బట్టి 5వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు ఉంటుంది. ఇంకా పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులలో అయితే 1500రూపాయల వరకు ఉంది అన్నా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఇక డాక్టర్ దగ్గరికి వెళ్లి చెక్ చేయించుకున్న తర్వాత, టెస్టుల పేరుతో తర్వాత దోపిడీ మొదలవుతుంది.

డయాగ్నస్టిక్ సెంటర్స్ నుండి డాక్టర్ లకు కమీషన్లు
డాక్టర్ రాసిన టెస్టులు చేయించుకోవాలంటే డాక్టర్ సూచించిన డయాగ్నస్టిక్ సెంటర్ కు మాత్రమే వెళ్లాలి. అక్కడ మాత్రమే టెస్టులు చేయించుకుని రావాలి. ఇక ఇలా డాక్టర్ డయాగ్నస్టిక్ సెంటర్ ను సూచించిన డయాగ్నస్టిక్ సెంటర్ నుండి డాక్టర్లకు కమిషన్ అందుతుంది. ప్రస్తుతం కార్పొరేట్ ఆసుపత్రులలో ఉన్న వైద్యులు చేస్తున్న దందాలలో ఇది ఒకటి.

ఫార్మా కంపెనీలతో వైద్యుల టై అప్
ఇక టెస్ట్ రిపోర్టులు వచ్చిన తర్వాత డాక్టర్ వాటిని పరిశీలించి మందులు ప్రిస్క్రైబ్ చేయాలి. ఇక ఆ మందులు డాక్టర్లు వివిధ కంపెనీలతో పెట్టుకున్న టై అప్ ఆధారంగా రాస్తారు. మెడిసిన్ యొక్క జనరిక్ రాయకుండా, పలానా టాబ్లెట్లు తీసుకోండి అని ప్రిస్క్రైబ్ చేస్తారు. ఒక్కో కంపెనీ టాబ్లెట్లు విపరీతమైన ధర ఉంటుంది. కొందరు ధనార్జనే ధ్యేయం అయిన వైద్యులు అది అవసరం లేకున్నప్పటికీ మనకు సూచిస్తారు.

మందులతోనూ వైద్యుల దందా
దాని ద్వారా సదరు మందుల కంపెనీల నుండి డాక్టర్లకు భారీగానే బహుమతులు అందుతాయి. ఇక ఆ మెడిసిన్స్ సదరు ఆసుపత్రిలోనే కొనుక్కోవాలి, బయట కొనుక్కుందాం అన్నా దొరకనివి రాస్తారు. ఇక డాక్టర్ గారు సూచించారని గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఆయన రాసిన మందులను రోగులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లిన సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి.

కార్పొరేట్ ఆసుపత్రుల తీరుతో ఆరోగ్య సంక్షోభం
ఇంత ఖర్చు పెట్టి సరైన వైద్యం జరిగిందా అంటే వందలో 70 మంది లేదు అని చెబుతున్నారు. రాష్ట్రంలో కార్పొరేట్ ఆసుపత్రుల తీరును ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీకి అడ్డు, అదుపు లేకుండా పోతుందని లబోదిబోమంటున్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల పుణ్యమా అంటూ ఆరోగ్య సంక్షోభం నెలకొందని పలువురు వాపోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+