ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ ఎగ్ బోండా.. ఇలా సింపుల్ గా చేసి చూడండి!
రోడ్డు పక్కన అమ్మే ఎగ్ బోండాలు చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే బయట చేసే ఎగ్ బోండా చేసే పదార్ధాలు, నూనె నాణ్యమైనవి వాడకపోతే అనవసరపు అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే మనం ఇంట్లోనే వీటిని తయారు చేసుకుని తింటే మంచిది. ఈ ఎగ్ బోండా కరకరలాడే బయటి పొరతో, లోపల సాఫ్ట్ ఉడికిన గుడ్డు కాంబినేషన్ నోట్లో వేసుకుంటే మరోసారి తినాలనిపించేలా ఉంటాయి.
కావాల్సిన పదార్థాలు:
శనగపిండి- 2 కప్పులు,
ఉడికించిన కోడిగుడ్లు - 8,
పచ్చిమిర్చి - 8,
పసుపు అర - టీస్పూన్,
ఉప్పు - రుచికి,
కారం - 1 టీస్పూన్,
ధనియాల పొడి -1 టీస్పూన్,
జీలకర్ర - 1 టీస్పూన్,
జీలకర్ర పొడి - అర టీస్పూన్,
గరం మసాలా - అర టీస్పూన్,
చాట్ మసాలా - 1 టీస్పూన్,
కరివేపాకు - కొద్దిగా,
వంటసోడా - 2 చిటికెడ్లు,
నూనె - సరిపడా.

తయారీ విధానం:
ఉడికించిన గుడ్లను రెండు ముక్కలుగా కట్ చేసి ఉంచండి. పచ్చిమిర్చి, కరివేపాకు తరిగి పెట్టుకోండి. ఒక గిన్నెలో శనగపిండి తీసుకుని కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర, గరం మసాలా, చాట్ మసాలా, కారం, జీలకర్ర పొడి కలపండి. కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ బజ్జీ పిండి కన్సిస్టెన్సీకి తీసుకురండి. చివరగా వంటసోడా కలిపి ఉంచండి.
ఇలా చేస్తే సూపర్ టేస్టీ ఎగ్ బొండాలు
కడాయిలో నూనె వేడి చేసి మీడియం ఫ్లేమ్‌పై ఉంచండి. గుడ్డు ముక్కలను పిండిలో బాగా దట్టించి ఒక్కొక్కటిగా నూనెలో రౌండ్ గా బోండాల మాదిరిగా వేయండి. రెండు నిమిషాలు ఉంచి, తర్వాత తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించి తీయండి. పైన కొద్దిగా కారం చల్లి, ఉల్లిపాయ ముక్కలతో కలిపి తింటే రుచి ఇంకా బాగుంటుంది. ఇలా చేస్తే ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ ఎగ్ బోండాలు సిద్ధం అయినట్టే. ఇంట్లో చేసినా స్ట్రీట్ స్టైల్ రుచితో ఉంటే పిల్లలు ముఖ్యంగా ఇవి ఎక్కువ ఇష్టంగా తింటారు.













Click it and Unblock the Notifications
