తగ్గుతున్న మగ సంతతి.. పురుషులలో కనుమరుగవుతున్న y క్రోమోజోమ్!
ప్రస్తుతం భూమి మీద మగ పిల్లల సంఖ్య తగ్గిపోతుంది. ఇక భవిష్యత్ లో మగపిల్లలే పుట్టరు అనేంత ప్రమాదం పొంచి ఉంది. తాజాగా మగవారిలో కనిపించే వైక్రోమోజోమ్ కనుమరుగవుతుంది అన్న ఒక అధ్యయనం అందరినీ షాక్ కి గురిచేస్తుంది.మగజాతి పుట్టుకకు మూలం వై క్రోమోజోమ్. అది తగ్గిపోవటం నిజంగా ఆందోళనకరం.
ఆడ, మగ పుట్టుకకు క్రోమోజోములే మూలం
ఆడవాళ్ళ కడుపులో పెరుగుతున్న పిండం మగదా, ఆడదా అన్నది తల్లిదండ్రుల క్రోమోజోముల ద్వారానే నిర్ణయించబడుతుంది. ఆడవారిలో రెండు ఎక్స్ క్రోమోజోములు, మగవారిలో ఎక్స్ వై క్రోమోజోములు ఉంటాయి. ఆడ మరియు మగ పిల్లల పుట్టుకకు ఈ క్రోమోజోముల కలయికే మూలం, ఎక్స్ ఎక్స్ క్రోమోజోములు కలిసినప్పుడు ఆడపిల్లలు. ఎక్స్ వై క్రోమోజోములు కలిసినప్పుడు మగ పిల్లలు పుడతారు.

వై క్రోమోజోమ్ కనుమరుగైతే మానవజాతి ప్రమాదంలో
అంటే అబ్బాయి పుట్టాలంటే కచ్చితంగా వై క్రోమోజోములు ఉండాల్సిందే.. మగవారిలో వై క్రోమోజోములు పూర్తిగా నశించిపోతే మగ పిల్లలు పుట్టరు. కాబట్టి ఆడపిల్లలే పుడతారు. మగపిల్లలు లేకపోతే సృష్టి ఆగిపోతుంది. ఆడవారు పిల్లల్ని కనాలన్నా మగజాతి ఉండాల్సిందే. మగపిల్లల పుట్టుకకు మూలమైన వై క్రోమోజోము కనుమరుగైతే మొత్తం మానవజాతి నాశనమైపోతుంది ఇక ఈ విషయాన్ని ఇటీవల ఒక అధ్యయనం తేల్చి చెప్పింది.
వై క్రోమోజోము కు ప్రత్యామ్నాయాన్ని కనిపెట్టాలన్న అధ్యయనం
మానవులలో వైక్రోమోజోమ్ తగ్గుతుందని భవిష్యత్తులో పూర్తిగా అదృశ్యం కూడా కావచ్చని సైన్స్ అలర్ట్ లోని ఒక నివేదిక వెల్లడించింది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చని వై క్రోమోజోము కు ప్రత్యామ్నాయాన్ని కనుగొన లేకపోతే మానవజాతి భూమిమీద అదృశ్యమయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
వై క్రోమోజోమ్ తగ్గడంపై ప్రస్తుతం శాస్త్రవేత్తల ఆందోళన
ప్రొసీడింగ్స్ అఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లో ప్రచురించబడిన పరిశోధనా పత్రంలో కొత్త జన్యువులను అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని పేర్కొంది. మనం కొత్త క్రోమోజోమ్ లను అభివృద్ధి చేయవచ్చని చెబుతూనే అందులో ఉండే ఇబ్బందులను, ప్రమాదాలను కూడా వెల్లడించింది. ఏది ఏమైనా మగవారిలో వై క్రోమోజోమ్ తగ్గడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తుంది. వై క్రోమోజోమ్ పూర్తిగా కనుమరుగైతే అది కచ్చితంగా ప్రమాదమేనని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications