మటన్ తింటే డయాబెటిస్ ప్రమాదం.. ఎలాగో తెలుసుకోండి!
చాలామంది నాన్ వెజ్ ను ఇష్టంగా తింటూ ఉంటారు. ఇక నాన్ వెజ్ లోను మటన్ అంటే చాలామంది ఇష్టపడతారు. మటన్ ను తరచూ తింటూ ఉంటారు. అంతేకాదు వీకెండ్ లోను తప్పనిసరిగా నాన్ వెజ్ తినాల్సిందే. ఇక ఇంకా ఏదైనా ఫంక్షన్, పార్టీ జరిగిన నాన్ వెజ్ ఉండాల్సిందే. బయట హోటల్స్ లో తినడానికి వెళ్ళినా కూడా ఎక్కువమంది నాన్ వెజ్ ఆహారాన్ని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు.
మటన్ తింటున్నారా?
అయితే నాన్ వెజ్ లోను మటన్ ఎక్కువగా తినేవారు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఓ పరిశోధనలో తెలిసింది. సహజంగా మటన్ లో కావలసిన ప్రోటీన్లు, పోషకాలు ఎన్నో పుష్కలంగా ఉంటాయి. మటన్ తినడం వల్ల ప్రయోజనాలను పొందవచ్చని డైటీషియన్లు చెబుతున్నారు. ఇదే సమయంలో అధికంగా మటన్ వినియోగం కూడా మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. మటన్ ఎక్కువగా తింటే రకరకాల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

మటన్ తినేవారిపై కేంబ్రిడ్జి యూనివర్సిటీ పరిశోధన
మటన్ ఎక్కువగా తినే వారికి డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధకులు వెల్లడించారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో ఈ విషయం తేటతెల్లమైందని సమాచారం. మటన్ తినే అలవాటు ఉన్న వారిని ఈ పరిశోధనలో భాగంగా 10 సంవత్సరాల పాటు పరిశీలించారు పరిశోధకులు.
మటన్ ఎక్కువగా తినేవారికి డయాబెటిస్ ముప్పు
వారంలో రెండు మూడు సార్లు ఏదో ఒక రూపంలో మటన్ తినేవారిలో డయాబెటిస్ రావడానికి పదిహేను శాతం ఎక్కువ అవకాశం ఉందని వారు ఈ పరిశోధన ద్వారా వెల్లడించారు. మన శరీరంలో ఇన్సులిన్ విడుదలను మటన్ లో ఉన్న హానికరమైన సాచ్యురేటెడ్ కొవ్వులు అడ్డుకుంటాయని, ఫలితంగా శరీరానికి కావలసిన ఇన్సులిన్ విడుదల కాక టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందని గుర్తించినట్టు పేర్కొన్నారు.
ప్రాసెస్ చేసిన మటన్ తింటే మరీ డేంజర్
ఇక మనం స్వయంగా ఇంట్లో వండుకున్న మటన్ కు, బయట మనం ప్రాసెస్ చేసే నిల్వ ఉంచిన ప్యాకేజ్డ్ మటన్ కు మధ్య కూడా వ్యత్యాసం ఉందని, బయట ప్రాసెసింగ్ చేసి నిల్వ ఉంచిన మటన్ తినేవారిలో టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం మరీ ఎక్కువగా ఉందని వారు గుర్తించినట్టు పేర్కొన్నారు. మటన్ తినడం మంచిదే అయినప్పటికీ తరచూ దానిని మంచిది కాదని, అలాగే నిల్వ ఉంచిన ప్యాకేజ్డ్ మటన్ తినడం కూడా మంచిది కాదని చెప్తున్నారు.
మటన్ లిమిట్ లేకుండా తింటే అనారోగ్య సమస్యలు
పరిమితికి మించి మటన్ తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని, అందులో దీర్ఘకాలిక వ్యాధి అయిన టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం మరింత ఎక్కువగా ఉందని హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మటన్ ప్రియులు ఆరోగ్యం విషయంలో బి అలర్ట్.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications