గీజర్ వాటర్ తో స్నానం చేస్తున్నారా?
సహజంగా మనం స్నానం చేయాలంటే ఎండాకాలం మినహాయించి, మిగతా అన్ని సీజన్లలోనూ వేడినీళ్లనే చేయాలని భావిస్తాం. వేడినీళ్లతో స్నానం చేస్తే మనసుకు హాయి కలుగుతుందని, శరీరానికి రిలాక్స్ వస్తుందని చాలామంది భావిస్తూ ఉంటాం. ఒకప్పుడు వేడి నీళ్లు కావాలంటే గ్యాస్ మీద, కట్టెల పొయ్యి మీద కాచుకొని వాడేవాళ్లు. అయితే ఈ రోజుల్లో ఎలక్ట్రిక్ హీటర్లు. గీజర్ల వాడకం బాగా పెరిగింది.
గీజర్ వాటర్ తో స్నానం చేసేటప్పుడు జాగ్రత్త
ఎలక్ట్రిక్ హీటర్లే కాదు గీజర్లు కూడా సరిగ్గా వాడకపోతే అనేక ప్రమాదాలకు కారణమవుతాయి. ఇక గీజర్ వాటర్ తో స్నానం చేయడం మంచిదని కొంతమంది, మంచిది కాదని మరి కొంతమంది భావిస్తూ ఉంటారు, గీజర్ వాటర్ తో స్నానం చేస్తే జుట్టు ఊడిపోతుంది అని బలంగా నమ్మే వాళ్ళు కూడా లేకపోలేదు. అయితే గీజర్ వాటర్ తో స్నానం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.

అలా నీళ్ళు పోసుకుంటే జుట్టు ఊడటం ఖాయం
గీజర్ వాటర్ తో స్నానం చేసేవాళ్ళు ఖచ్చితంగా వాటర్ యొక్క టెంపరేచర్ను చూసుకోవాలి. మరీ ఎక్కువ వేడి నీళ్లు స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిది కాదు. సలసలా కాగిన నీళ్ళ ను నెత్తి మీద పోసుకుంటే కచ్చితంగా జుట్టు ఊడిపోతుంది. ఎప్పుడైనా స్నానం చేసేటప్పుడు గోరువెచ్చని నీళ్ళని స్నానం చేస్తేనే మంచిది. మరి ఎక్కువ వేడి నీళ్లు స్నానం చేస్తే అది ఆరోగ్యానికి చేటు చేస్తుంది.
గీజర్ వాడితే ఈ విషయాలు మర్చిపోవద్దు
అంతేకాదు గీజర్ ఆన్ చేసి ట్యాప్ తిప్పి చాలామంది స్నానం చేస్తూ ఉంటారు. ఇది ఏ మాత్రం మంచిది కాదు. గీజర్ నీళ్లతో స్నానం చేసేవాళ్లు స్నానానికి ముందే గీజర్ను ఆఫ్ చేయడం మర్చిపోవద్దు. గీజర్ ను ఆఫ్ చేసిన తర్వాతనే స్నానం చేయాలి. అలా కాకుండా గీజర్ ఆన్ చేసి నిర్లక్ష్యంగా స్నానం చేస్తే ఒక్కోసారి వాటర్ లో కూడా విద్యుత్ వచ్చి కరెంట్ షాక్ కు గురయ్యే ప్రమాదం ఉంటుంది.
ఎక్కువ సేపు గీజర్ నీళ్ళ స్నానం.. చర్మానికి హాని
చాలామంది వేడి నీళ్లతో స్నానం హాయిగా ఉందని ఎక్కువసేపు స్నానానికి టైం కేటాయిస్తారు అయితే ఎక్కువ సేపు వేడి నీళ్ల స్నానం చేయడం వల్ల చర్మానికి సంబంధించిన సమస్యలు వస్తాయి. చర్మం తన సహజ నూనెలను కోల్పోతుంది. దీని కారణంగా అనేక చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
గీజర్ లతో ఈ ప్రమాదం
అంతేకాదు గీజర్ నీళ్ల తో స్నానం చేసేటప్పుడు ఎక్కడైనా గీజర్ చుట్టూ వాటర్ లీకేజీలు ఉంటే గమనించుకోవాలి. గీజర్లను ఎక్కువ సేపు ఆన్ చేసి కూడా ఉంచకూడదు. ఇలా ఎక్కువ సేపు ఆన్ చేసి ఉంచడం వల్ల దాని బాయిలర్ లో ఒత్తిడి పెరిగి పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి గీజర్ నీళ్లతో స్నానం చేయాలనుకునేవారు ఈ ముఖ్యమైన విషయాలను గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications