పరగడుపున ఈ ఆహారాలు అస్సలే తినొద్దు... తింటే జరిగేదిదే!

చాలామంది ప్రతిరోజూ ఉదయం నిద్ర లేచిన తర్వాత పరగడుపున ఏం తినాలి? ఏం తినకూడదు? అనేది తెలుసుకోకుండా ఆహారాన్ని తీసుకుంటారు. పరగడుపున తీసుకునే ఆహారం విషయంలో కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు. ఒకవేళ జాగ్రత్తలు తీసుకోకుండా పరగడుపున ఏది పడితే అది తింటే అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇక పరగడుపున మనం తినకూడని ఆహార పదార్థాలు ఏంటి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

పరగడుపున ఈ ఆహారాలు తీసుకోకూడదు
పరగడుపున మనం ఉప్పు, కారం, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోకూడదు. ఖాళీ కడుపుతో ఈ ఆహారాన్ని తీసుకుంటే గుండెల్లో మంటగా ఉంటుంది. ఇది మనకు ఇబ్బందిని కలిగిస్తుంది. ఇక పరగడుపున మనం పుల్లగా ఉండే సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోకూడదు. నిమ్మ, నారింజ వంటి వాటిని పరగడుపున తీసుకుంటే గ్యాస్ సమస్య వస్తుంది.

Do not eat these foods during with empty stomach

ఉదయాన్నే ఈ పానీయాలు తీసుకోకూడదు
చాలా మంది ఉదయాన్నే కాఫీ, టీలు తాగుతూ ఉంటారు. పరగడుపున ఎలాంటి ఆహారం తినకుండా కాఫీ, టీలు తాగితే కూడా ఎసిడిటీ సమస్య వస్తుంది. అది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో పొరపాటున కూడా శీతల పానీయాలు తీసుకోకూడదు. వీటిలో ఉండే కార్బోనేటెడ్ గ్యాస్ మనకు పొట్ట ఉబ్బరాన్ని కలిగిస్తుంది.

తీపి పదార్ధాలు పరగడుపున తింటే జరిగేదిదే
పరగడుపున పొరపాటున కూడా తీపి పదార్థాలు తీసుకోకూడదు. ఒకవేళ ఉదయం ఆహారంలో భాగంగా మొదట తీపి పదార్థాలు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి జీర్ణాశయంలో ఉన్న ఎంజైములు బద్ధకంగా మారుతాయి. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. పరగడుపున నూనెలో డీప్ ఫ్రై చేసిన ఆహారాలను తినకూడదు. వీటిని తినడం వల్ల నీళ్లను ఎక్కువ తాగడంతో పాటు పొట్ట ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి.

నిల్వ పచ్చళ్ళు, పాలపదార్ధాలు తింటున్నారా?
పొరబాటున కూడా పరగడుపున టిఫిన్ తో పాటు నిల్వపచ్చళ్ళు తీసుకోకూడదు. పచ్చళ్ళలో ఉప్పు, కారం, నూనె ఎక్కువగా ఉంటాయి. ఇవి మనకు గ్యాస్ సమస్యను, అజీర్తిని కలిగిస్తాయి. ఇక పరగడుపున చీజ్ వంటి ఆహారాలను తీసుకోకూడదు. చీజ్ లో కొవ్వు ఎక్కువగా ఉండటం వల్ల ఈ పాలపదార్థాలు పరగడుపున తింటే అజీర్తి సమస్య వస్తుంది. పరగడుపున పొరపాటున కూడా ఐస్క్రీమ్ ని తీసుకోకూడదు. ఇది మన జీర్ణవ్యవస్థను ఇబ్బంది పెడుతుంది.

ఆరోగ్య సమస్యలు వచ్చే చాన్స్... జాగ్రత్త
ఫ్యాట్ తో పాటు చక్కర శాతాన్ని ఇందులో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది మనకు అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఇక పరగడుపున చాలా లైట్ గా సులభంగా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవడం మంచిది. పైన పేర్కొన్న ఆహారాలను తీసుకొని అనారోగ్యాల బారిన పడకుండా ఎంపిక చేసుకున్న ఆహారాన్ని తీసుకొని ఆరోగ్యంగా ఉండడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+