పన్నీర్ తింటున్నారా? అయితే ఇవి తప్పక తెలుసుకోండి!
భారతీయ వంటకాలలో రుచికరమైన వంటకం గా పన్నీర్ ను చూస్తారు. పన్నీర్ ను మనం వండుకు తినే రకరకాల వంటకాలలో వేసి వండుతూ ఉంటారు. పన్నీర్ బటర్ మసాలా, పాలక్ పన్నీర్, మటర్ పన్నీర్, పన్నీర్ తో ప్యాజా, బటర్ పనీర్, పన్నీర్ పరోటా, పన్నీర్ టిక్కా ఇలా రకరకాల వంటకాలు మనం ఎక్కువగానే రుచి చూస్తూ ఉంటాం.
పన్నీర్ లో ఫుల్ పోషకాలు
అయితే పన్నీర్ తినడం మంచిదేనా? పన్నీర్లో ఉండే పోషకాలు ఏమిటి? పన్నీర్ తో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి? అనేది ప్రస్తుతం తెలుసుకుందాం. పన్నీర్ లో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. పన్నీర్ తక్కువ కార్బోహైడ్రేట్లు, ఎక్కువ ప్రోటీన్ కలిగిన ఆహారం. ఇది శాఖాహారులకు మంచి ప్రోటీన్ ను ఇచ్చే ఫుడ్. ఇది మన శరీరం సరైన పనితీరును కనబరిచే అవసరమైన ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది.

పన్నీర్ తింటే ఆరోగ్య ప్రయోజనాలు
క్రమం తప్పకుండా ఎవరైతే పన్నీర్ తింటారో వారికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పన్నీర్ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి ఇది దోహదం చేస్తుంది. పన్నీర్ ను తింటే కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. పన్నీర్ మన కండరాల పని తీరుకు బాగా దోహదం చేస్తుంది. బాడీ బిల్డర్లు, అథ్లెట్ లకు పన్నీర్ చాలా మంచి పోషకాహారం.
పన్నీర్ తో డయాబెటిస్ కంట్రోల్
పన్నీర్ రక్తంలో చక్కెరను కంట్రోల్ చేస్తుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తికి ఎంతగానో దోహదం చేస్తుంది. పన్నీర్ ను ఆహారంలో భాగంగా చేసుకోవడం మన శరీరంలో ఇమ్యూనిటీ లెవెల్స్ ను పెంచుతుంది. పన్నీర్ మనలను జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడుతుంది. ఎముకలు మరియు దంతాలకు పన్నీర్ ఎంతో మేలు చేస్తుంది.
పన్నీర్ తో మెదడు ఆరోగ్యం
పన్నీర్ మన మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది మన నాడీ వ్యవస్థ పనితీరును నిర్వహించడానికి సహాయపడుతుంది. మతిమరుపు వంటి సమస్యలను తగ్గిస్తుంది .పన్నీర్ మన మానసిక ఆందోళనను తగ్గించడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. నరాల సంబంధిత అనేక సమస్యలకు పరిష్కారాన్ని సూచిస్తుంది.
పన్నీర్ విషయంలో ఇది మర్చిపోకండి
ఎన్నో పోషకాలు మరియు బోలెడన్ని ప్రయోజనాలు కలిగిన రుచికరమైన ఆహారమైన పన్నీర్ ను క్రమం తప్పకుండా ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. అయితే అతిగా తినడం మాత్రం ప్రమాదకరం.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా "క్యారెట్ హల్వా" ఎలా చేయాలంటే..? -
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
షుగరు బాధితులు వేసవిలో ఎలాంటి స్నాక్స్ తినాలి..!! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..?












Click it and Unblock the Notifications