డాక్టర్ దగ్గరకు వెళితే నాలుక ఎందుకు చూపించమంటారో తెలుసా!

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు కానీ ఆరోగ్యం చెడిపోతే తిరిగి ఆరోగ్యవంతులుగా మారడం చాలా కష్టమని పెద్దలు పదే పదే చెబుతారు. అందుకే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తారు. ఎప్పుడైనా మనకు చిన్న అనారోగ్యంగా అనిపిస్తే వైద్యుల దగ్గరికి వెళతాం. వైద్యుల దగ్గరికి వెళ్ళిన సందర్భంలో డాక్టర్లు ముందు మనల్ని నాలుక చూపించమని అడుగుతారు.

ఆరోగ్యవంతుల నాలుక ఇలా
అసలు డాక్టర్లు నాలుక ఎందుకు చూపించమంటారు? నాలుక ద్వారా డాక్టర్లు గుర్తించేది ఏమిటి? మన నాలుక ఏ సంకేతాలను ఇస్తుంది? ప్రస్తుతం మనం తెలుసుకుందాం. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి నాలుక గులాబీ రంగులో ఉంటుంది. లేత గులాబీ రంగు, ముదురు గులాబీ రంగులో నాలుక ఉంటుంది. నాలుక పైన సన్నని తెల్లటి పొర కూడా ఉంటుంది. ఆరోగ్యకరంగా ఉన్న వ్యక్తి నాలుక ఎప్పుడు తేమగా ఉంటుంది.

Do you know why doctors asks to show patients tongue when patient consults doctor

నాలుక రంగు బట్టి అనారోగ్యం గుర్తిస్తారు
డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు నాలుకను చూసి నాలుక తేమగా ఉందా, డ్రై గా ఉందా.. నాలుక పైన ఏమైనా మచ్చలు ఉన్నాయా? నాలుక ఏ రంగులో కనిపిస్తుంది. అన్న దానిని బట్టి ఆరోగ్య సమస్యలను గుర్తిస్తారు. నాలుకపై తెల్లని మచ్చలు ఉంటే ఈస్ట్ ఇన్ఫెక్షన్కు సంకేతంగా చెబుతారు. నాలుక నల్లగా కనిపిస్తే గొంతులో బ్యాక్టీరియా, ఫంగస్ వంటి కారణంగా నల్లగా మారినట్టు గుర్తిస్తారు. కొన్ని సందర్భాలలో నాలుక నలుపు రంగులోకి మారడం క్యాన్సర్ ని కూడా సూచిస్తుందని చెబుతారు.

నాలుక పసుపుం నీలి రంగుల్లోకి మారితే ఇవే సమస్యలు ఉన్నట్టు
ఇక నాలుక పసుపు రంగులోకి మారితే కామెర్లుగా భావిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో నాలుక పసుపు రంగుగా మారడం డయాబెటిస్ కి కూడా సంకేతంగా చెబుతారు. నాలుక నీలిరంగులోకి మారినట్టు కనిపిస్తే అది గుండె సంబంధిత వ్యాధులను సూచిస్తుందని చెబుతారు. గుండె శరీరంలో రక్తాన్ని సరిగ్గా పంపు చేయని సమయంలో నాలుక నీలిరంగులోకి మారుతుంది. రక్తంలో సరిగ్గా ఆక్సిజన్ స్థాయి లేనప్పుడు నాలుక నీలిరంగులోకి మారుతుంది.

నాలుక ఎర్రగా మారితే ఏమవుతుంది అంటే
నాలుక ఎర్రగా మారినట్టు కనిపిస్తే విటమిన్ లోపం ఉన్నట్టు, జ్వరం ఉన్నట్టు సంకేతంగా చెబుతారు. నాలుక మృదువుగా మారితే ఇన్ఫెక్షన్లు, ఐరన్, ఫోలిక్ ఆసిడ్ లోపమని గుర్తిస్తారు. నాలుక తెల్లబడితే రోగ నిరోధక వ్యవస్థకు ఇబ్బంది కలుగుతుందని గుర్తిస్తారు. ఇక నాలుక పగిలినట్టుగా కనిపిస్తే అది సోరియాసిస్ వంటి సమస్యలకు సంకేతంగా చెబుతారు. అందుకే డాక్టర్లు అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వెళ్లినప్పుడు నాలుక చూపించమని అడుగుతారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+