మోకాళ్ళ నొప్పి బాధిస్తుందా? ఇలా చేస్తే రెండు నెలల్లో రిజల్ట్స్!
ఇప్పుడు సమాజంలో వయసుతో నిమిత్తం లేకుండా చాలామంది మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. ఇక చలికాలంలో మోకాళ్ళ నొప్పి సమస్యలు మరింత వేధిస్తాయి. మోకాళ్ళ నొప్పులు ఇప్పుడు అతిపెద్ద సమస్యగా మారుతున్నాయి .ఒకప్పుడు వయసు మీద పడిన వారికే ఎముకల్లో క్షీణత కారణంగా వచ్చే మోకాళ్ళ నొప్పి ఇప్పుడు చిన్న వయసులో కూడా రావడం ఆందోళన కలిగిస్తుంది.
మోకాలి నొప్పి తగ్గటానికి ఇలా చెయ్యండి
భారతదేశంలో ప్రతి సంవత్సరం 1,20,000 మందికి మోకాలి మార్పిడి ఆపరేషన్లు చేస్తున్న పరిస్థితి ఉంది అంటే ఎంత ఎక్కువగా మోకాలి నొప్పి సమస్య వేధిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మోకాళ్ళ నొప్పి తీవ్రంగా ఉన్నవారు ఆ నొప్పిని తగ్గించుకోవడానికి మందులు వాడడంతో పాటు, కొన్ని చిట్కాలు పాటిస్తే ఉపశమనం లభిస్తుంది. మోకాలి నొప్పిని తగ్గించడానికి మోకాలు చుట్టూ ఉండే కండరాలను బలోపేతం చేయడానికి కొన్ని ఎక్సర్ సైజులు చేయాలి.

ఈ ఆసనాలతో, బరువు తగ్గితేనూ మోకాళ్ళ నొప్పుల నుండి రిలీఫ్
శశాంకాసనం, నౌకాసనం మోకాళ్ళ నొప్పులు తగ్గించడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఇక మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి ముఖ్యంగా బరువు తగ్గడం ఎంతగానో ఉపయోగపడుతుంది .విపరీతమైన బరువు ఉన్న వారిలో కూడా మోకాలు నొప్పి సమస్య తీవ్రంగా ఉంటుంది. బరువు తగ్గితే మన శరీర బరువు మోకాలు మీద పడడం తగ్గుతుంది. కాబట్టి మోకాలు నొప్పి కొంతమేరకు తగ్గి మనకు ఉపశమనాన్ని ఇస్తుంది.
కొబ్బరినూనెతో ఇలా చేస్తే రిలీఫ్
ఇక ఇదే సమయంలో మోకాలు నొప్పి తగ్గించుకోవడానికి ఇంట్లోనే మనం కొన్ని చిట్కాలను కూడా పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కొబ్బరి నూనెలో ముద్ద కర్పూరాన్ని కలిపి ప్రతి రోజు రెండు మూడు సార్లు గోరువెచ్చగా చేసి మోకాలికి మర్దన చేస్తే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
ఈ పొడి ట్రై చెయ్యండి.. గుడ్ రిజల్ట్స్
అంతేకాదు టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ మెంతులు, అర టీ స్పూన్ మిరియాలు కలిపి మెత్తని పిండిలా చేసి ఆ పిండిని ప్రతిరోజు ఒక గ్లాసు నీళ్లలో కలుపుకొని తాగితే కూడా మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇక మోకాళ్ల నొప్పులు తగ్గించుకోవడానికి మోకాలి శస్త్ర చికిత్సకి వెళ్లడానికి ముందు ఈ చిట్కాలను ట్రై చేసి చూడండి.
ఇలా చేస్తే రెండు నెలల్లో ఉపశమనం
కచ్చితంగా నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం క్రమ పద్ధతిలో చిట్కాలను పాటించడం చేస్తే 20 రోజుల నుంచి రెండు నెలల్లో మీకు మోకాలి నొప్పి తగ్గి మార్పు కచ్చితంగా కనిపిస్తుంది. కనుక ఈ రెమెడీస్ ని తప్పకుండా ట్రై చేసి చూడండి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
పొట్టు మినపప్పుతో రోటిపచ్చడి.. తింటే అసలే వదిలిపెట్టరు! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
'వెయిట్ లాస్ సూప్'.. ఇలా చేసుకుని తాగితే వెయిట్ లాస్ గ్యారంటీ..!! -
ఈ "చామదుంపల బిర్యానీ" ముందు నాన్ వెజ్ బిర్యానీలు కూడా తక్కువే !! -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications