మైగ్రేన్ తలనొప్పి వేధిస్తుందా? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి

మైగ్రేన్ ఇది ఒక విపరీతమైన తలనొప్పి. మైగ్రేన్ తో బాధ పడేవారు మరే ఇతర పనులపైనా ఫోకస్ పెట్టి పని చెయ్యలేరు. అసలు మైగ్రేన్ తలనొప్పి ఎందుకు వస్తుంది? మైగ్రేన్ తలనొప్పి సాధారణంగా ఒకవైపున గుచ్చుకున్నట్టు, కొట్టుకున్నట్టు ఒక రకమైన బాధను కలిగిస్తూ వచ్చే తలనొప్పి. ఏదైనా కాంతిని చూసినా, శబ్దాన్ని విన్నా భరించలేని సున్నితత్వం తో కూడిన తలనొప్పి. వికారం, వాంతులు వంటి లక్షణాలతో కూడినటువంటి తలనొప్పి.

మైగ్రేన్ తలనొప్పికి కారణాలు ఎన్నో
మైగ్రేన్ తలనొప్పి తో బాధపడే వారికి కళ్ళ చుట్టూ నొప్పి, దృష్టిలో మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. ఒత్తిడి వల్ల, నిద్రలేమి సమస్యల వల్ల, హార్మోన్లలో జరిగే మార్పుల వల్ల, జన్యుపరమైన అంశాల వల్ల కూడా మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంది. మైగ్రేన్ రావడానికి ఇది అని పర్టిక్యులర్ గా కారణాన్ని చెప్పలేము. మైగ్రేన్ దీర్ఘకాలంగా ఉంటే, అది మానసిక ఒత్తిడిని పెంచి పనిసామర్థ్యాన్ని తగ్గిస్తుంది.

Do you suffer from migraine headache But take these precautions

మైగ్రేన్ నియంత్రించకపోతే నరాల సమస్యగా మారే అవకాశం
దీర్ఘకాలిక మైగ్రేన్ గల వ్యక్తులు తరచుగా మానసిక, శారీరక అనారోగ్యానికి గురవుతారు. మైగ్రేన్ నియంత్రించకపోతే, అది నరాల సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంటుంది. ఈ తలనొప్పికి తగినంత నీరు తాగకపోవడం, అనారోగ్యకరమైన ఆహారం, మితిమీరిన కాఫీ లేదా ఆల్కహాల్ తీసుకోవడం వంటి అనేక కారణాలు కూడా ఉంటాయి. స్మోకింగ్, బహుళ రకాల రసాయనాలతో తయారైన ప్రాసెస్డ్ ఫుడ్ కూడా మైగ్రేన్ తలనొప్పికి కారణం అవుతుంది.

ఆహారపు జాగ్రత్తలు
మైగ్రేన్ ఉన్నవారు గ్లుటెన్, ప్రాసెస్డ్ ఫుడ్, ఆల్కహాల్, కాఫీ, చాక్లెట్, ఎక్కువ ఉప్పు, కారంగా ఉండే ఆహారం ఎక్కువ తినకూడదు. బదులుగా ఆకుకూరలు, పండ్లు,కూరగాయలు తీసుకోవాలి తగినంత నీరు, పొటాషియం అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిది. తరచుగా ఆహారాన్ని మానేయకుండా ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యానం లంచ్ ,అలాగే రాత్రికి పళ్ళు తింటే మైగ్రేన్‌ను తగ్గించే అవకాశం ఉంది.

మైగ్రేన్ నివారణ మార్గాలు
నియంత్రిత జీవనశైలి, ఆరోగ్యకరమైన ఆహారం, సమయానికి నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించడం వంటి మార్పులు మైగ్రేన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ప్రతిరోజూ యోగాసనాలు, ధ్యానం చేయడం వల్ల మైగ్రేన్ తీవ్రత తగ్గే అవకాశం ఉంది. ఎక్కువ నీరు తాగడం,తొందరగా జీర్ణం అయ్యే తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది , రాత్రి సమయంలో ఆలస్యం చేయకుండా తొందరగా భోజనం చేసే తగినంత విశ్రాంతి తీసుకోవడం కూడా మైగ్రేన్ ను తగ్గించడానికి దోహదం చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+