ఆరోగ్యంతో పాటు పోషకాలనిచ్చే స్పెషల్ లడ్డూ కావాలా నాయనా!
చాలామంది చిరు తిండ్లు ఎక్కువగా తింటూ ఉంటారు. ఇంట్లో తయారుచేసిన అనేక రకాల పిండివంటలను తెగ లాగించేస్తూ ఉంటారు. ఇక అలా ఎడాపెడా పిండి వంటలను తినడం వల్ల విపరీతంగా బరువు పెరుగుతారు. నూనెలలో ముంచి తీసిన ఆహారాలు తింటే అనేక రోగాలతో పాటు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే చిరుతిండి తినాలి అనుకునేవారు ఆ తినే పదార్థాలు కూడా పోషకాలు ఉన్న పదార్థాలను ఎంచుకోవాలని ప్రస్తుతం చాలామంది చెబుతున్నారు.
ఆరోగ్యాన్ని ఇచ్చే లడ్డు
చిరుతిండ్ల కోరికను తీర్చి మీ క్రేవింగ్స్ కు తగ్గట్టు ఒక అద్భుతమైన లడ్డు చేసుకొని తింటే మంచిదని సూచిస్తున్నారు. మరి ఏమిటా లడ్డు... దానిని ఎలా చేసుకోవాలి.. ఆ లడ్డుని తినడం వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి అంటే.. పల్లీలు, నువ్వులు, ఎండుకొబ్బరి, బాదంపప్పు, ఖర్జూర పండ్లు, అంజీర పండ్లు, సన్ ఫ్లవర్ సీడ్స్, పుచ్చ గింజలు, ఎండు ద్రాక్ష, అవిసె గింజలు వీటన్నింటిని దోరగా వేయించి పొడిగా చేసుకోవాలి.

ఈ లడ్డు తో లెక్కకు మిక్కిలి ఆరోగ్య ప్రయోజనాలు
అందులో బెల్లం పొడిని కలిపి నెయ్యితో ఉండలు చుట్టి వాటిని ఎప్పుడైనా తినాలి అనుకుంటే చిరుతిండిగా తింటే మంచిదని సూచిస్తున్నారు. ప్రతిరోజు ఈ లడ్డుని తినడం వల్ల ఆరోగ్యం వస్తుందనీ , అనారోగ్యాలు కలగవని చెబుతున్నారు.పుష్కలంగా పోషకాలు ఉండే ఈ లడ్డుని తింటే లెక్కకు మిక్కిలి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
ఆరోగ్యంపై అద్భుతం చేసే లడ్డు
ఒబెసిటీ ఉన్నవారికి బరువు తగ్గడంతో పాటు శరీరానికి కావలసిన ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా అందడం వల్ల శరీరంలోని అన్ని భాగాలపై ఈ లడ్డు ప్రభావం చూపిస్తుంది. రక్తనాళాల నుండి నరాలు, కండరాలు, చర్మం వరకు ప్రతి ఒక్కదానిపైన ఎన్నో పోషక విలువలు ఉన్న లడ్డు అద్భుతాలు చేస్తుంది. అంతకుముందు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈ లడ్డును తింటే క్రమంగా కోలుకునే అవకాశం ఉంటుంది.
అద్భుతమైన లడ్లు ఆరోగ్యం కోసం
మంచి ఎనర్జీ తో ఉత్సాహంగా తిరుగుతారు. శరీరానికి కావలసిన వ్యాధి నిరోధక శక్తి ఈ లడ్డుతో లభిస్తుంది. ఏది ఏమైనా ఏమి తినాలి అనుకున్న ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ అద్భుతమైన లడ్లు తినండి. మీ ఆరోగ్యంలో వచ్చే మార్పులు మీరే గమనించండి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications