ఈ పనులు చేస్తే మీకు సంతోషం కలుగుతుంది.. సైంటిఫిక్ గా ప్రూవ్ అయ్యింది!

సంతోషంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. ప్రతి ఒక్కరూ సంతోషంగానే ఉండాలి అనుకుంటారు. అయితే సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? అనేది మనం కచ్చితంగా తెలుసుకోవాలి. మన శరీరంలో డోపమైన్ హార్మోన్ ప్రేరేపించబడితే, ఉత్తేజాన్ని పొందితే మనకు సంతోషం కలుగుతుంది. మన బాడీలో ఉండే హ్యాపీ హార్మోన్స్ మనం చేసే కొన్ని పనులవల్ల ఉత్తేజితం అవుతాయని సైంటిఫిక్ గా నిరూపించబడింది. మనం ఈ పనులు చేస్తే ఖచ్చితంగా సంతోషంగా ఉంటాం.

వ్యాయామం, ధ్యానం చేయడం
క్రమం తప్పకుండా ప్రతిరోజు వ్యాయామం చేస్తే శారీరక మానసిక ఆనందం కలుగుతుంది. ధ్యానం చేయడం వల్ల కూడా మానసిక, శారీరక ప్రశాంతత లభిస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. దీనివల్ల డోపమైన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా మనకు సరదాగా ఉండడం, సంతోషంగా ఉండడం అనే భావన కలుగుతుంది.

Doing these things will make you happy with dopamine production It s scientifically proven

Take a Poll

హైడ్రేటెడ్ గా ఉండడం
మన శరీరాన్ని ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. డీహైడ్రేట్ కాకుండా శరీరానికి కావలసిన తగినంత నీటిని ఎప్పుడు తాగుతూ ఉండాలి. నీళ్లు తాగడం వల్ల శరీరంలో డోపమైన్ లెవెల్స్ పెరుగుతాయి. ఇది మిమ్మల్ని సంతోషంగా ఉండేలా చేస్తుంది. కనుక తగినంత నీళ్ళు తాగటం మరచిపోవద్దు.

తగినంత నిద్ర
మనం సంతోషంగా ఉండాలంటే కచ్చితంగా తగినంత నిద్ర పోవాలి. ప్రతిరోజు ఏడు నుండి ఎనిమిది గంటల పాటు నిద్రపోతే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యవంతమైన శరీరంలో డోపమైన్ హార్మోన్ ఉత్పత్తి జరుగుతుంది. దీంతో మనం సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుంది.

తగినంత సూర్యరశ్మి
మన శరీరానికి తగినంత విటమిన్ డి అవసరం. విటమిన్ డి ని పొందడం కోసం ప్రతిరోజు తెల్లవారుజామునే కాసేపు సూర్యకాంతిలో గడపాలి. సూర్యకాంతిలో గడిపిన వారికి డోపమైన్ హార్మోన్ ఉత్పత్తి జరుగుతుంది. ఎవరైతే సూర్యకాంతి లేకుండా ఉంటారో వారిలో విటమిన్ డీ తగ్గిపోతుంది.. ఫలితంగా అనారోగ్యం వస్తుంది. విటమిన్ డీ శరీరానికి కావాల్సినంత ఉంటే మనం సంతోషంగా ఉంటాం.

మంచి ఆహారం
మన శరీరానికి పోషకాలను అందించే మంచి ఆహారాన్ని ప్రతిరోజు తీసుకోవాలి. మంచి పోషకాహారం తీసుకోవడం వల్ల మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటే డోపమైన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా ఇది మన సంతోషానికి ఎంతగానో దోహదం చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+