దొండకాయ కొబ్బరి పచ్చడి.. తిన్నవాళ్ళు తప్పక మెచ్చుకుంటారు!

రోటి పచ్చడి.. మనం తినే ఆహారంలో రోటి పచ్చడికి ఉండే ప్రత్యేకత అంతా ఇంతా కాదు. అలాంటి రోటి పచ్చళ్ళు రోజూ చేసుకుతింటే నోటికి అమృతంలా ఉంటుంది. ఈ రోజు మనం దొండకాయ కొబ్బరి పచ్చడి ఎలా చెయ్యాలో తెలుసుకుందాం . దొండకాయ, కొబ్బరి రోటి పచ్చడి అనేది ఆంధ్ర, తెలంగాణ ఇళ్లలో చాలా ఇష్టపడే సాధారణమైన పచ్చడి. అన్నం, దోశ, ఇడ్లీతో కలిపి తింటే రుచి ఎంతో బాగుంటుంది.

కావలసిన పదార్ధాలు

దొండకాయలు - పావుకిలో
పచ్చి కొబ్బరి- ఒక చిప్ప
పచ్చి మిరపకాయలు - 10 నుండి 12 కారం బట్టి
జీలకర్ర - ఒక స్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 10
కరివేపాకు - 2 రెమ్మలు
కొత్తిమీర - కొద్దిగా
చింతపండు- కొద్దిగా
ఉప్పు - ఒక స్పూన్( రుచికి తగినంత)
నూనె- ౩ టేబుల్ స్పూన్స్
పోపు గింజలు - ఒక స్పూన్
ఎండు మిర్చి- 2

dondakaya kobbari pachadi know how to make delicious Dondakaya Kobbari Pachadi at home in andhra style
తయారీ విధానం

ముందుగా తాజా దొండకాయలు తీసుకుని బాగా కడిగి, చివరలు కోసి సన్నగా ముక్కలు చేసుకోండి. ఒక పాన్ లో కొద్దిగా నూనె పోసి దొండకాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు, పచ్చి మిరపకాయలు, కొద్దిగా చింతపండు వేసి బాగా దోరగా వేయించండి. దొండకాయలు కాస్త మెత్తబడి, రంగు మారే వరకు వేయించాలి. ఈ మిశ్రమాన్ని స్టవ్ ఆఫ్ చేసి చల్లారే దాకా ఆగండి.

ఇలా పచ్చడి చేస్తే రుచి అదుర్స్

తర్వాత రోట్లో గానీ, మిక్సీలో గానీ పచ్చడి రుబ్బండి. మరీ మెత్తగా రుబ్బితే పచ్చడి టేస్ట్ తగ్గుతుంది. ఈ మిశ్రమంలో తగినంత ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి మిక్సీ చేయండి. దీనిని మళ్ళీ స్టవ్ పైన పాన్ పెట్టి నూనె వేసి, వేడి అయిన తర్వాత అందులో ఎండుమిర్చి, పోపు గింజలు వేసి, కొద్దిగా కరివేపాకుతో పోపు చేస్తే అంతే చాలా రుచికరమైన దొండకాయ, కొబ్బరి పచ్చడి రెడీ అవుతుంది. దీని రుచి అదుర్స్‌గా ఉంటుంది.

బెండకాయ, టమాటా పచ్చడి.. ఇలా చేసి తినండి.. నోటికి సూపర్ టేస్ట్!
బెండకాయ, టమాటా పచ్చడి.. ఇలా చేసి తినండి.. నోటికి సూపర్ టేస్ట్!

ఈ పచ్చడి ఇలా చేస్తే తిన్నవాళ్ళు అందరూ మెచ్చుకుంటారు

ఈ పచ్చడి తయారీ చాలా సులభం. ఇంట్లో ఉన్న సాధారణ పదార్థాలతోనే తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి. తిన్నవాళ్ళు అందరూ మెచ్చుకుంటారు.సాధారణంగా చేసే పచ్చడికి కొన్ని చిన్న మార్పులు చేస్తే రుచి మరింత పెరుగుతుంది. మరి మీరూ ట్రై చేసి చూడండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+