నిద్ర లేవగానే ఈ పనులు చేస్తే ఇక మీ ఆరోగ్యం అంతే!

ప్రతి ఒక్కరికి ఉరుకుల పరుగుల జీవితంలో తొలి ప్రాధాన్యత ఆరోగ్యానికి ఇవ్వాలి. అలాంటివారు మీరు నిద్ర లేవగానే చేసే పనుల విషయంలో జాగ్రత్త వహించాలి. నిద్రలేవగానే చేసే కొన్ని పనులు, అలవాట్లు మీ ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడతాయి. అందుకే ఉదయం నిద్ర లేవగానే చెయ్యకూడని పనులను ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి.

ఉదయం నిద్ర లేవకుండా ఉంటే జరిగేదిదే
చాలామంది ఉదయం నిద్ర లేవరు. చాలా పొద్దుపోయే దాకా బెడ్ దిగరు. అలాంటి వారు అనారోగ్యం బారిన పడటం ఖాయం. ఉదయం నిద్రలేచి సూర్యరశ్మిలో తిరిగిన వారికి వారి శరీరానికి కావాల్సిన విటమిన్ డీ లభిస్తుంది. ఒకవేళ ఉదయం ప్రతీరోజూ నిద్ర లేవకుంటే మంచాన పడే ప్రమాదం ఉంటుంది.

Don t do these things as you wake up in the morning your health will be in danger

స్మార్ట్ ఫోన్ చూడవద్దు
నిద్ర లేవగానే మొదటగా మన చేతిలోకి వచ్చేది స్మార్ట్ ఫోన్. నిద్రలేవగానే స్మార్ట్ ఫోన్ చూసేవారు చాలా మంది ఉంటారు. వారు త,అ ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది అన్న విషయాన్ని గమనించకుండా ఫోన్ కు అడిక్ట్ అయ్యి చూస్తూ ఉంటారు. నిద్ర లేవగానే మొదటి పనిగా మొబైల్ చూడటమే పెట్టుకుంటారు. అలాంటి వారి ఆరోగ్యం ప్రమాదంలో పడటం ఖాయం.

ఉదయం లేవగానే స్మార్ట్ ఫోన్ చూస్తే కళ్లపై ప్రభావం
స్మార్ట్ ఫోన్లను ఎక్కువగా వినియోగించడం వలన కాంతి నేరుగా మన కంటిపై పడి మెదడుకు తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. కంటి చూపు మందగించడం, తలనొప్పి రావడం జరుగుతుంది. కనుక ఉదయం లేచిన వెంటనే మొబైల్ ఫోన్స్ చూడొద్దు.

బ్రేక్ ఫాస్ట్ చేయకుండా ఉండటం
కొంతమంది బ్రేక్ ఫాస్ట్ చేయకుండానే రోజువారి పనుల నిమిత్తం బయటికి వెళ్తూ ఉంటారు. ఆఫీస్ కు వెళ్లేవారు బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఎప్పుడో మధ్యాహ్నానికి కూడా సరిగ్గా తినకపోవడం చేత వారి ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. మరి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకపోవడం ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది.

శారీరక వ్యాయామం నిర్లక్ష్యం
ఇక చాలామంది ప్రతీరోజూ శారీరక వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు. శారీరక వ్యాయామం చేయటం ప్రతీ ఒక్కరికి అవసరం. కానీ శారీరక వ్యాయామం చేయకుండా ఉంటే శరీరం బరువు పెరుగుతుంది. ఫలితంగా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కనుక ఆరోగ్యంగా, ఫిట్ గా, ఉత్సాహంగా ఉండాలంటే వ్యాయామం చెయ్యాలి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+