శీతాకాలంలో ఆకుకూరలు వీరికి డేంజర్... తెలుసుకోండి!

చాలామంది ఆకుకూరలను ఇష్టంగా తింటారు. ఆకుకూరలలో ఉండే పోషకాలు మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయని బలంగా నమ్ముతారు. ప్రతిరోజు ఆకుకూరలను తింటే ఆరోగ్యం అని కూడా చాలామంది భావిస్తూ ఉంటారు. అయితే ఆకుకూరలు తినడం మంచిది అయినప్పటికీ అతిగా ఆకుకూరలను తినడం ఏమాత్రం మంచిది కాదు. వర్షాకాలంలోనూ, శీతాకాలంలోనూ కొన్ని రకాల ఆకుకూరలను తినడం కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఇబ్బంది కలిగిస్తుంది.

ఆకుకూరలతో ఆరోగ్యం
ఒకరకంగా చెప్పాలంటే కొంతమందికి ఆకుకూరలు ఎక్కువగా తినడం విషంతో సమానం అని చెప్పొచ్చు. ఇక శీతాకాలంలో ఎవరు ఎక్కువగా ఆకుకూరలు తినకూడదు? తినడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. ఆకుకూరలు నిస్సందేహంగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతిరోజు ఏదో ఒక ఆకుకూరను ఆహారంగా తీసుకుంటే ఉత్సాహంగా ఉండేందుకు దోహదం చేస్తుంది.

Don t eat leafy vegetables in this winter season those who are facing these health problems

ఆకు కూరలలో ఫుల్ పోషకాలు
ఆరోగ్యం కోసం వేలు, లక్షలు ఖర్చు పెట్టేవారు ఆకుకూరలతో ఆహారాన్ని అలవాటు చేసుకుంటే ఆసుపత్రి ఖర్చులు కొంతవరకు తగ్గించవచ్చని వైద్యులు చెబుతారు. ఆకుకూరల్లో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండడం, ప్రోటీన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండడం వంటి కారణాలతో అవి మన ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తాయని చెబుతారు.

వీళ్ళు ఆకుకూరలు తినొద్దు
అయితే ప్రస్తుతం శీతాకాలం కావడంతో మార్కెట్లో రకరకాల ఆకుకూరలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ముఖ్యంగా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఎక్కువ ఆకుకూరలను తినకూడదు. ముఖ్యంగా శీతాకాలంలో ఎక్కువ ఆకుకూరలు తినకూడని వారు ఎవరు అంటే.. గ్యాస్ సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఆకుకూరలు ఎక్కువగా తినకూడదు. ఆకుకూరలలో ఎక్కువగా ఫోలేట్ ఉంటుంది ఇది గ్యాస్ సమస్యను మరింత తీవ్రతరం చేసి వారిని ఇబ్బందికి గురిచేస్తుంది.

ఈ సమస్యలుంటే ఎక్కువ ఆకుకూరలు తినరాదు
ఇక అలర్జీ సమస్యలతో బాధపడేవారు, గర్భిణీలు శీతాకాలంలో ఎక్కువ ఆకుకూరలను తినకూడదు. ఆకుకూరల్లో ఆక్సలేట్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇది అలర్జీ సమస్యను మరింత పెంచుతుంది. అంతేకాదు కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఎక్కువ ఆకుకూరలను తినకూడదు. శీతాకాలంలో కీళ్ల నొప్పులు ఎక్కువ బాధిస్తాయి. అటువంటివారు ఆకుకూరలు తింటే ఆ సమస్య మరింత పెరుగుతుంది .

హై బీపీతో పాటు ఈ సమస్యలున్న వారు ఆకుకూరలు తినకండి
కిడ్నీ సమస్యలతో బాధపడే వారు కూడా ఎక్కువ ఆకుకూరలను తినకుండా ఉంటేనే మంచిది. థైరాయిడ్ సమస్య ఉన్నవారు కూడా ఎక్కువ ఆకుకూరలకు దూరంగా ఉండాలి..అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు ఆకుకూరలను ఎక్కువగా తినకూడదు. ఇది ప్రయోజనాన్ని చేకూర్చటానికి బదులు ఆరోగ్యానికి హాని చేస్తుంది. కాబట్టి ఈ సీజన్లో ఎక్కువ అక్కకూరలకు దూరంగా ఉండటం మంచిది

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+