విపరీతమైన తలనొప్పి, కాలు, చెయ్యి తిమ్మిరి.. బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం!

హార్ట్ స్ట్రోక్ తో మాత్రమే కాదు బ్రెయిన్ స్ట్రోక్ తో కూడా ప్రాణాల మీదకు వస్తుంది. హార్ట్ స్ట్రోక్ అయినా, బ్రెయిన్ స్ట్రోక్ అయినా ముందు చెప్పే వస్తుంది. అయితే మన శరీరంలో కలిగే మార్పులను, కనిపించే లక్షణాలను జాగ్రత్తగా గుర్తించి ముందుగానే చికిత్స తీసుకోగలిగితే వీటి నుంచి బయటపడవచ్చు. ప్రస్తుతం సమాజంలో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయి.

బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు
చాలామంది బ్రెయిన్ స్ట్రోక్ తో మంచం పడుతున్నారు. కదలలేని స్థితిలోకి చేరుకుంటున్నారు. ఇంకా అటువంటివారు మన శరీరం ముందుగానే ఇచ్చే లక్షణాలను గుర్తించి వైద్య సహాయం తీసుకుంటే బ్రెయిన్ స్ట్రోక్ నుంచి బయటపడవచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు ఎటువంటి లక్షణాలను చూపిస్తుంది అనే వివరాలలోకి వెళితే

don t neglect these symptoms which causes brain stroke

ఈ లక్షణాలు ఉంటె జాగ్రత్త
బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ముందు కొన్ని లక్షణాలు మనకి కనిపిస్తాయి, ముఖం, చేతులు, కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరి రావడం, విపరీతమైన బలహీనత, మాట్లాడడంలో ఇబ్బంది ఎదురు కావడం వంటి లక్షణాలు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు కనిపిస్తాయి. ఇది మాత్రమే కాదు ఒక కన్ను లేదా రెండు కళ్ళల్లో అస్పష్టమైన, లేదా డబుల్ దృష్టి, అంతేకాకుండా అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.

మెదడులోని ఏ భాగం ప్రభావితమైంది అనే దానిని బట్టి లక్షణాలు
ఒక్కొక్కసారి వాంతులు, కళ్ళు తిరిగి పడిపోవడం, నడవడం లోనూ, బ్యాలెన్సింగ్ చేయడంలోనూ ఇబ్బంది ఎదుర్కోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే బ్రెయిన్ స్ట్రోక్ యొక్క లక్షణాలు మెదడులోని ఏ భాగం ప్రభావితమైంది అనే దానిపైన ఆధారపడి ఉంటాయి. ఇక కొన్ని సందర్భాలలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కళ్ళ రెప్పలు మూత పడిపోవడం ఏదైనా మింగడంలో ఇబ్బంది కంటి కదలికలలో మార్పులు రావడం వంటివి కూడా కనిపిస్తాయి.

అసలే నిర్లక్ష్యం చెయ్యొద్దు
బ్రెయిన్ స్ట్రోక్ అనేది చాలా అత్యవసరమైన వైద్య పరిస్థితి. పైన పేర్కొన్న లక్షణాలలో ఏ లక్షణం కనిపించినా వెంటనే వైద్యుని వద్దకు వెళ్లి చికిత్స తీసుకోవాలి లేదంటే కదలలేని స్థితికి చేరుకోవచ్చు స్ట్రోక్ వల్ల మెదడుకు శాశ్వత నష్టం జరగవచ్చు. దీర్ఘ కాలిక వైకల్యం రావచ్చు. కొన్ని కేసులలో ఇది మరణానికి కూడా దారి తీయవచ్చు. కాబట్టి బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు కనిపిస్తే అసలే నిర్లక్ష్యం చేయకండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+