health tips: ఈ తప్పులు చేస్తూ వాకింగ్ చెయ్యొద్దు: వాకింగ్ ఇలా చేస్తేనే గుడ్ రిజల్ట్!!

ప్రతిరోజు వాకింగ్ చేసినా ఫలితం ఉండడం లేదా? వాకింగ్ చేస్తున్నప్పటికీ ఆరోగ్య స్థితిలో మార్పు రావడం లేదా? అయితే మీరు వాకింగ్ చేసే సమయంలో ఈ తప్పులు చేస్తూ ఉండొచ్చు. వాకింగ్ చేసేటప్పుడు చేయవలసింది ఏమిటి? చేయకూడనివి ఏమిటి? అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన అవసరం ఉంది.

చాలామంది వాకింగ్ చేయడానికి కాలనీలో వాళ్ళను లేదా స్నేహితులను వెంటపెట్టుకుని వెళుతుంటారు. వారితో పిచ్చాపాటి ముచ్చట్లు పెట్టుకుంటూ సరదాగా వాకింగ్ చేస్తారు. అయితే ఇలా వాకింగ్ చేయడం ఏమాత్రం ప్రయోజనాన్ని ఇవ్వదని అధ్యయనాలు తేల్చాయి. పదిమందిలో గుంపుగా వాకింగ్ చేస్తే అది మనం ఆశించే ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కలిగించదని తేలింది. కాబట్టి గుంపుగా వాకింగ్ చేసేవారు, అలా వాకింగ్ చేయకూడదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

Dont walk making these mistakes: Good result only with silent walking!!

మాట్లాడుకుంటూ, ఏవో అంశాల మీద చర్చిస్తూ, సమస్యలను ఇతరులకు చెప్పుకుంటూ వాకింగ్ చేస్తే అది ఏమాత్రం మంచిది కాదని పరిశోధనలో వెల్లడయింది. అంతేకాదు చాలామంది వాకింగ్ చేసే వాళ్ళు చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ వాకింగ్ చేస్తూ ఉంటారు. ఇలా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తో వాకింగ్ చేయడం మంచిది కాదని చెబుతున్నారు.

ఉదయాన్నే ఎలక్ట్రానిక్ గాడ్జెట్ లను పట్టుకుని తిరగడం వల్ల మనసు, శరీరం రెండు బరువెక్కిపోతాయని, ఇవి ఏమాత్రం ప్రయోజనాన్ని కలిగించవని పరిశోధనలో తేలిందని చెబుతున్నారు. మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందాలనుకునేవారు సైలెంట్ వాకింగ్ చేయడం మంచిది. సైలెంట్ వాకింగ్ వల్ల మనసు మన కంట్రోల్ లో ఉంటుందని, ధ్యానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను మీకు అందిస్తుందని చెబుతున్నారు.

సైలెంట్ వాకింగ్ వల్ల మనలో ఏకాగ్రత పెరుగుతుందని, మన ఆరోగ్య స్థితి మెరుగు పడుతుందని చెబుతున్నారు.సైలెంట్ వాకింగ్ వల్ల ప్రయోజనాలు కలుగుతాయని.. ఒకటి మన ఆలోచనలపై మనకు గ్రిప్, రెండవది మనం ప్రకృతిని ఆస్వాదిస్తూ వాకింగ్ చేయగలుగుతామని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ప్రతిరోజు సైలెంట్ గా ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా అరగంట పాటు నడిస్తే టెన్షన్ లు తగ్గుతాయని, మానసిక ప్రశాంతత కలుగుతుందని చెబుతున్నారు.

సైలెంట్ వాకింగ్ ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడమే కాకుండా, మన జీవన శైలిలో మార్పులకు కూడా కారణమవుతుందని చెబుతున్నారు. కాబట్టి మంచి ప్రయోజనాలు పొందాలనుకునేవారు సైలెంట్ వాకింగ్ చేయాలి. వాకింగ్ సమయంలో ఇతరత్రా వేటి పైన మనసు లగ్నం చేయకూడదు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+