దోసకాయ టమాటో ఇన్‌స్టంట్ నిల్వ పచ్చడి.. ఇలా చేస్తే అదుర్స్!
మనం రకరకాల పచ్చళ్లను తయారు చేసుకుంటూ ఉంటాం. అయితే ఇన్స్టెంట్ గా దోసకాయ టమాటో నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. చాలా సులభంగా తయారు చేసుకోగలిగే ఈ పచ్చడి ఒక రెండు వారాల పాటు ఫ్రిజ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుంది. ఎంతో రుచికరంగా, మన నోటికి టేస్ట్ తెలిసేలా అద్భుతంగా ఉండే ఈ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాం
కావాల్సిన పదార్థాలు
దోసకాయ - మూడు పెద్దవి గింజలు తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి
టమాటో - 5 పెద్దవి (ముక్కలు చేసుకోండి)
కారం - 50 గ్రాములు
ఉప్పు- 70 గ్రాములు
ఇంగువ - చిటికెడు
పసుపు - ¼ టీస్పూన్
నూనె - 100 గ్రాములు
జీలకర్ర పొడి - స్పూన్
మెంతిపొడి- మూడు స్పూన్లు
ఆవపొడి- మూడు స్పూన్లు
ఆవాలు - ½ టీస్పూన్
జీలకర్ర - ½ టీస్పూన్
కరివేపాకు - 1 కొమ్మ
ఎండుమిర్చి - 1-2
వెల్లుల్లి - 150 గ్రాములు
చింతపండు - 30 గ్రాములు

తయారీ విధానం
స్టవ్ వెలిగించి దోసకాయ ముక్కలు, టమాటో ముక్కలు, చింతపండు కలిపి కుక్కర్లో పెట్టి మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించండి. ఆ తర్వాత కుక్కర్ విజిల్ వదిలాక టమాటా ముక్కలు దోసకాయ ముక్కల పైన ఉన్న తొక్కలు తీసేసి దానిని మెత్తగా మెదపాలి. ఆపై అందులో 50 గ్రాముల కారం, 70గ్రాముల ఉప్పు, మూడు స్పూన్ల మెంతి పొడి, మూడు స్పూన్ల ఆవపొడి, స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలపండి.
ఇలా చేస్తే పచ్చడి సూపర్ టేస్టీ
ఆపై ఒక బాణలిలో నూనె పోసి వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు చేయండి. అందులో కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిని కొంత వేసి, మిగతా వెల్లుల్లిని పచ్చి దానినే పచ్చడిలో కలపండి. ఇప్పుడు మొత్తం తాలింపును పచ్చడిలో పోసి బాగా కలపండి.
ఇన్స్టెంట్ దోసకాయ టమాటా నిల్వ పచ్చడి రెడీ
అంతే రుచికరమైన ఇన్స్టెంట్ దోసకాయ టమాటా నిల్వ పచ్చడి రెడీ అయినట్టే. ఇది చల్లారిన తర్వాత గాజు సీసాలో పోసి ఫ్రిజ్‌లో ఉంచండి. ఇలా చేస్తే రెండు వారాల పాటు నిల్వ ఉంటుంది. అన్నం, దోసె, ఇడ్లీ, రోటీలతో ఇది చాలా బాగుంటుంది.













Click it and Unblock the Notifications