బీర్ మంచిదని తాగుతున్నారా? అయితే ఈ షాకింగ్ నిజాలు మీ కోసమే!!
మద్యపానం ఆరోగ్యానికి హానికరం. కానీ చాలామంది ఆల్కహాల్ కి అడిక్ట్ అవుతుంటారు. బీరు, బ్రాందీ, విస్కీ అంటూ రకరకాల మద్యాన్ని తాగుతూ ఉంటారు. అయితే మద్యం సేవించే అలవాటు ఉన్నవారిలో ఎక్కువమంది బీరు తాగుతూ ఉంటారు. అయితే బీర్ తాగే అలవాటు ఉన్నవారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు వైద్య నిపుణులు.
బీర్ తాగేవాళ్లు ఆహారంతో జాగ్రత్త
బీరు తాగే అలవాటు ఉన్నవాళ్లు వారానికి ఒక్క బీరు మాత్రమే తాగాలని చెబుతున్నారు. బీరు వల్ల గ్యాస్ సమస్య ఉత్పన్నమవుతుందని బీర్ ఎక్కువగా తాగకూడదంటున్నారు. ఇలాంటి సమయంలో కొన్ని రకాల ఆహార పదార్థాలు బీరుతో కలిపి తీసుకోకూడదని కూడా చెబుతున్నారు. చాలామంది బీర్ తాగే వాళ్ళు స్టఫ్ గా కొన్ని ఆహారాలను తింటూ ఉంటారు. బీర్ తాగే వాళ్ళు మిర్చి, గారెలు, చికెన్ ఇలా రకరకాల ఆహారాలను తింటూ ఉంటారు.

ఈ ఆహారాలు బీర్ తో కలిసి తీసుకోకండి
అయితే బీరు తాగేవాళ్లు సెనగపిండితో చేసిన పదార్థాలు అస్సలు దగ్గరికి రానివ్వకూడదని చెబుతున్నారు. ఇదే సమయంలో చికెన్ లివర్ కూడా అసలే తినకూడదని హెచ్చరిస్తున్నారు . మిర్చీలు, బజ్జీలు, ఆలు బజ్జీలు, సమోసాలు వీటిని కూడా స్టఫ్ గా తీసుకోవడం మంచిది కాదని చెబుతున్నారు. బీర్ తాగే అలవాటు ఉన్నవాళ్లు సీ ఫుడ్స్ తినకూడదని హెచ్చరిస్తున్నారు.
హార్ట్ ఎటాక్ ప్రమాదం
అంతే కాదు చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలాంటివి కూడా స్టఫ్ లో మంచిది కాదని చెబుతున్నారు. ఇలాంటి ఆహారం బీర్ తాగే సమయంలో తీసుకోవటం వలన హార్ట్ ఎటాక్ వస్తుందని అంటున్నారు. అయితే బీర్ తాగే వాళ్ళు ఈ ఆహార పదార్థాలు కాకుండా మరేం తినాలి అంటే బీరు తాగేటప్పుడు స్టఫ్ గా పండ్లను తింటే మంచిదని చెబుతున్నారు.
ఆల్కాహాల్ కు దూరంగా ఉంటేనే మంచిది
అసలు ఏ రూపంలో అయినా ఆల్కహాల్ తీసుకోవడమే మంచిది కాదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించి ఆల్కహాల్ అలవాటుకు దూరంగా ఉండటమే మంచిది. ఒకవేళ ఎప్పుడైనా సరే తాగితే ఆహారం విషయంలో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం నాశనం అయిన తర్వాత ఎవరేం చేసినా తిరిగి రాదు. కోరి కష్టాలను కొని తెచ్చుకోవటమే అవుతుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని












Click it and Unblock the Notifications