నిమ్మరసం తాగుతున్నారా? వీరికి డేంజర్.. తాగకండి!

నిమ్మరసం ఆరోగ్యానికి మంచిదే.. నిమ్మరసం తాగితే మన శరీరానికి కావాల్సిన సి విటమిన్ దొరుకుతుందని, అంతే కాదు నిమ్మరసంలో ఉండే పోషకాలు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయని చెబుతారు. అయితే కొంతమంది నిమ్మరసం తాగడం ఏ మాత్రం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు పొరపాటున కూడా నిమ్మరసాన్ని తీసుకోకూడదని చెబుతున్నారు.

నిమ్మరసం ఈ అనారోగ్య సమస్యలున్నవారు తీసుకోరాదు
నిమ్మకాయలో ఉండే విటమిన్ సి ఆరోగ్యానికి మేలు చేసేదే అయినప్పటికీ నిమ్మరసాన్ని పరిమితంగానే తీసుకోవాలి. అలాగే కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు నిమ్మరసానికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. దంతాల సమస్య ఉన్నవారు నిమ్మరసాన్ని తీసుకుంటే ఎక్కువ నీటిలో కలుపుకొని తీసుకోవాలి. లేదంటే దంతాల సమస్య జటిలంగా మారుతుంది.

Drinking lemon juice people with these health problems don t drink lemon juice

దంతాల సమస్య, అలెర్జీ సమస్య ఉన్నవారు జాగ్రత్త
మరీ తక్కువ నీటిలో లేదా నిమ్మరసాన్ని నేరుగా తీసుకున్న దంతాలు బాగా దెబ్బతిని ఇబ్బంది పడతారు. ఇక కొంతమందికి సిట్రస్ పండ్లను తింటే దురద, దద్దుర్లు వంటివి వస్తాయి. అలర్జీ సమస్యతో బాధపడేవారు నిమ్మరసానికి దూరంగా ఉండాలి. కొంతమందికి నిమ్మరసాన్ని తీసుకుంటే పెదవులు, నాలుక పైన, గొంతులోన వాపు వస్తుంది. అలాంటివారు నిమ్మరసానికి దూరంగా ఉండాలి.

మందులు వాడేవారు నిమ్మరసంతో జాగ్రత్త
కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు మందులు వాడేవారు నిమ్మరసం తాగితే వాటి ప్రభావం సరిగా పనిచేయదు. కాబట్టి వారు కూడా నిమ్మరసానికి దూరంగా ఉండాలి. నిమ్మకాయ కాలేయం యొక్క ఎంజైములను ప్రభావితం చేయడం వల్ల మందులు వాడే వారిలో ఆ మందులు పనిచేయకుండా పోతాయని చెబుతారు.

యాసిడ్ సమస్య, అల్సర్స్ సమస్య ఉంటే జాగ్రత్త
అంతే కాదు కొంతమంది ఎసిడిటీతో బాధపడుతూ ఉంటారు. కడుపులో యాసిడ్ సమస్యతో బాధపడేవారు పొట్టలో యాసిడ్ రియాక్షన్స్ జరిగినప్పుడు, అల్సర్ సమస్య ఉన్నప్పుడు నిమ్మరసాన్ని నేరుగా తీసుకోకూడదు. తక్కువ నీటిలో కలిపి తీసుకున్న కూడా ఇబ్బంది వస్తుంది. కనుక నిమ్మరసాన్ని తీసుకోవాలనుకునేవారు ఈ అనారోగ్య సమస్యలు కానీ అలర్జీలు కానీ లేకుండా ఉండాలి.

పరిమితంగా నిమ్మరసం తీసుకుంటే బెనిఫిట్
అయితే అతిగా నిమ్మరసాన్ని తీసుకోవడం కూడా ఏ మాత్రం మంచిది కాదు. ఏదైనా పరిమితంగా క్రమబద్ధంగా తీసుకున్నప్పుడే దాని నుండి మంచి ఫలితం వస్తుంది. కాబట్టి పైన పేర్కొన్న అనారోగ్య సమస్యలు ఉన్నవారు పొరపాటున కూడా నిమ్మరసాన్ని అతిగా తీసుకోకండి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+