శొంఠి ఆరోగ్య అద్భుతాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

ఆరోగ్యంగా ఉండాలని భావించే వారు మన ఆరోగ్యానికి దోహదం చేస్తే ఎన్నో పదార్థాలు మన కళ్ళముందే ఉన్నాయి అనే విషయం గమనించాలి. అటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చే పదార్థాలలో శొంఠి ఒకటి. శొంఠి పొడి మన ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తుంది. దీనిలో ఉండే ఔషధ గుణాలు మనల్ని అనేక రోగాల నుంచి కాపాడతాయి. ఇక అటువంటి అనేక ప్రయోజనాలను చేకూర్చే శొంఠి పొడి గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

శొంఠి తో ఫుల్ ఆరోగ్య ప్రయోజనాలు
శొంఠి ఆయుర్వేదం మనకు ప్రసాదించిన అత్యంత పురాతనమైన మసాలా దినుసు పచ్చి అల్లాన్ని ఎండబెడితే తయారయ్యేదే శొంఠి. ఇక ఈ శొంఠి పొడి చేసుకుంటే దానిని ప్రతిరోజు మనం క్రమ పద్ధతిలో ఆహారంలో భాగంగా చేసుకుంటే అది మన శరీరానికి ఊహించని మేలు కలిగిస్తుంది. ముఖ్యంగా శొంఠి మన బరుగును తగ్గించడానికి ఎంతగానో దోహదం చేస్తుంది.

dry ginger can do miracles on health with weight loss immunity boost and many more

బరువును తగ్గించటం మాత్రమే కాదు ఇమ్యూనిటీ బూస్టర్ గా
శొంఠి పొడిలో జీర్ణక్రియను మెరుగుపరిచే లక్షణాలు ఉండటం వల్ల అది మన జీవక్రియ రేటును పెంచి కొవ్వును కరిగించడానికి సహాయం చేస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో, బరువును తగ్గించడంలో శొంఠి గణనీయమైన పాత్రను పోషిస్తుంది. శొంఠి పొడిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇమ్యూనిటీ పెంచడంతో పాటుగా నొప్పులు, వాపులు నుండి ఉపశమనం కలిగిస్తాయి.

రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే శొంఠి
శొంఠి అనేక ఇన్ఫెక్షన్లు, వైరస్ల దాడి నుంచి మన శరీరాన్ని కాపాడుతుంది. మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను శొంఠి తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మైగ్రేన్ వంటి నొప్పుల తీవ్రతను కూడా శొంఠి తగ్గిస్తుంది.

శొంఠి చేస్తుంది మీ శరీరంలో అద్భుతం
గోరువెచ్చని నీటిలో ఒక చెంచా శొంఠి పొడి కలుపుకుని తాగడం వల్ల మన జీవ క్రియ మెరుగుపడుతుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. మన చర్మాన్ని మరమ్మత్తు చేయడంలోనూ రక్షించడంలోనూ ఉపయోగపడుతుంది. ఇన్ని విశేషమైన గొప్ప గుణాలు ఉన్న శొంఠి ప్రతి ఒకరి ఇంట్లో ఖచ్చితంగా ఉండవలసిన దివ్య ఔషధం. ప్రతీ రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే ఇది మన శరీరంలో అద్భుతమైన మార్పులకు కారణం అవుతుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+