రోజుకో బెల్లం ముక్క తిని చూడండి.. ఏం జరుగుతుందో తెలుసుకోండి!
మన శరీరానికి ఆరోగ్యాన్ని చేకూర్చే వాటిల్లో శరీరానికి కావాల్సిన పోషకాలను అందించే వాటిలో బెల్లం ఒకటి బెల్లం. మనకు కావలసిన పోషకాలను అందించి అనేక అనారోగ్య సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యల నుంచి నెలసరి సమస్యల వరకు అన్ని సమస్యల పరిష్కారానికి బెల్లం దోహదం చేస్తుంది.
బెల్లంలో పోషకాలు
బెల్లంలో ఐరన్, కాల్షియం, జింక్, కాపర్, మెగ్నీషియం, ప్రోటీన్, పాస్ఫరస్, పొటాషియం వంటి ఎన్నో ఖనిజాలతో పాటు బి కాంప్లెక్స్, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఈ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. అందుకే ప్రతినిత్యం మనం ఒక చిన్న బెల్లం ముక్కను తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. బెల్లం తినడం వల్ల నయం కానీ అనారోగ్యం అంటూ ఉండదు అంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు.

బెల్లంతో ఆరోగ్య ప్రయోజనాలు
బెల్లాన్ని తింటే బీపీ అదుపులో ఉంటుంది. బెల్లం మన శరీరానికి కావలసిన తక్షణ శక్తిని అందిస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. శరీరానికి కావలసిన ఐరన్ ను పుష్కలంగా అందిస్తుంది. అంతే కాదు మనకు నెలసరి సమస్యల నుంచి ఉపశమనాన్ని కూడా కల్పిస్తుంది. ప్రతిరోజు ఒక చిన్న బెల్లం ముక్క తినడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది.
బెల్లంతో అలెర్జీల నుండి రక్షణ
బెల్లాన్ని తరచూ ఆహారంలో తీసుకోవడం వల్ల శ్వాస సంబంధితమైన అలర్జీల బారిన పడకుండా మన శరీరాన్ని కాపాడుకోవచ్చు. ఇక మలబద్ధకంతో బాధపడే వారికి బెల్లం ఎంతో బాగా ఉపయోగపడుతుంది. గర్భిణీలు బెల్లాన్ని తరచూ ఆహారంలో తీసుకుంటే వారితో పాటు కడుపులో ఉన్న బిడ్డకు కూడా మంచిది.
బెల్లంతో రక్తహీనతకు చెక్
బెల్లంలో అత్యధికంగా ఐరన్, ఫాస్ఫరస్ ఉంటుంది. ఇది మన శరీరంలో హిమోగ్లోబిన్ ను తయారు చేయడానికి సహాయపడుతుంది. మన రక్తాన్ని శుద్ధి చేసే గుణం బెల్లానికి ఉంటుంది. అంతేకాదు మన శరీరంలో రక్తహీనతను తగ్గించడానికి కూడా బెల్లం దోహదం చేస్తుంది. ఇక పీరియడ్ రాక ఇబ్బంది పడే వారికి బెల్లం ఎంతో బాగా పనిచేస్తుంది. పీరియడ్ సమయంలో తీవ్రమైన కడుపునొప్పితో బాధపడే వారికి కూడా బెల్లం ఎంతగానో ఉపయోగపడుతుంది.
బెల్లంతో ఈ సమస్యల నుండి ఉపశమనం
ఇక మనం ప్రతిరోజు చిన్న బెల్లం ముక్కను తినడం వల్ల ఎముకలకు బలం చేకూరుతుంది. మన శరీరంలో వాపులు, నొప్పులు తగ్గుతాయి. కీళ్ల నొప్పులను బెల్లం నివారిస్తుంది. అయితే డయాబెటిస్ తో బాధపడేవారు బెల్లాన్ని తక్కువ మోతాదులో తినాలి. ఇక వేడికి సంబంధించిన సమస్యలతో బాధపడే వారు కూడా బెల్లం తినే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications