ఇవి తింటే గుర్రాలకు వచ్చినంత బలం వస్తుంది!
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. అటువంటి ఆరోగ్యం కోసం ఇటీవల కాలంలో గింజ ధాన్యాలను ఎక్కువగా తింటున్నారు. అలా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే వాటిలో కచ్చితంగా చెప్పుకోవలసినవి ఉలవలు. ఉలవలు తింటే గుర్రానికి వచ్చినంత బలం వస్తుందని పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు. ఒకప్పుడు ఉలవలను గుర్రాలకు ఆహారంగా పెట్టేవారు.
ఉలవలలో పోషకాలు ఫుల్
ఉలవలను ఇంగ్లీషులో హార్స్ గ్రామ్ అంటారు గుర్రానికి వచ్చినంత బలం ఉలవలను తింటే వస్తుందని ఉలవలలో ఉండే పోషకాలు అన్ని ఇన్ని కాదని చెబుతారు. మన శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఉండే ఉలవలు తెలుపు, నలుపు రెండు రకాలుగా లభిస్తాయి. ఉలవలలో ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, ఫైబర్, విటమిన్ బి, విటమిన్ బి 2, విటమిన్ బి6, సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

ఉలవలతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో
అంతే కాదు మన శరీరానికి కావలసిన ప్రోటీన్స్ కూడా ఉలవలలో ఉంటాయి. ఇక ఉలవలు తింటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఉలవలు శరీర బరువును తగ్గించడంలో ఎంతో బాగా సహాయపడతాయి. ఉలవలలో ఉండే ఫైబర్ రక్తంలో కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యానికి మంచి చేస్తుంది. ఉలవలు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.
ఉలవలతో డయాబెటిస్ కంట్రోల్
దీంతో డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది. శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఉలవలు ఎంతో బాగా పనిచేస్తాయి. ఉలవలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సమస్యల నివారణకు తోడ్పడతాయి. మహిళ లలో రుతుక్రమ సమస్యలకు ల్యూకోరియా చికిత్సకు ఉలవలు ఎంతగానో ఉపయోగపడతాయి.అతిమూత్ర వ్యాధికి ఉలవలు చక్కని ఔషధంగా పనిచేస్తాయి
ఉలవలను ఆహారంలో తీసుకుంటే ఎంతో బెస్ట్
ఉలవలు తింటే కాలేయ పనితీరు మెరుగుపడుతుంది. ఎముకలు బలోపేతం అవుతాయి. మూత్రపిండాలలో రాళ్ళను కరిగించడంలో ఉలవలు ఎంతగానో సహాయపడతాయి. రక్తహీనతను నివారించడానికి ఉలవలు తినడం ఎంతో మంచిది. పురుషులలో వీర్య వృద్ధికి ఉలవలు ఉపయోగపడతాయి. ఉలవలు తింటే పురుషులలో సెక్స్ సామర్ధ్యం బాగా పెరుగుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఉలవలను మనం నిత్యం ఆహారంలో భాగంగా చేసుకోవడం ఎంతో మంచిది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications