వృద్ధాప్యం త్వరగా రాకుండా ఈ ఆహారాలు తినండి!
మన పూర్వీకులతో పోల్చుకుంటే మనం చాలా త్వరగా వృద్ధాప్యం బారిన పడుతున్నాం. శారీరకంగా కూడా బలహీనులుగా ఉంటున్నాం. చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలతో ఇబ్బంది పడుతున్నాం. మనం వృద్ధాప్యం త్వరగా రాకుండా ఉండాలంటే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలని, వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదించేలా చేయడానికి కొన్ని రకాల ఆహారాలు ఉపయోగపడతాయని చెబుతున్నారు వైద్య నిపుణులు. వాటి గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
వృద్ధాప్యాన్ని నివారించే గ్రీన్ టీ
శారీరకంగా ఆరోగ్యంగా ఉండడంలో ఆహారం పాత్ర ఎంతో ఉంటుంది. రోజు మనం తీసుకోవలసిన యాంటీ ఏజింగ్ ఆహారాలను తీసుకుంటే అకాల వృద్ధాప్యాన్ని నివారించవచ్చు. అలాంటి వాటిల్లో మనం తీసుకోవలసినది గ్రీన్ టీ ఒకటి. గ్రీన్ టీ లో పాలీ ఫినాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి అకాల వృద్ధాప్యాన్ని నివారించడంలోనూ, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలోనూ ఎంతగానో సహాయపడతాయి. కాబట్టి గ్రీన్ టీ ని తాగడం మంచిది.

కొల్లాజిన్ ఉత్పత్తిని పెంచి ఆరోగ్యకరంగా చర్మం
సాల్మన్ వంటి కొవ్వు చేపలు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్, సెలీనియం తదితర అనేక పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన శరీరంలో కొల్లాజిన్ ఉత్పత్తిని పెంచి ఆరోగ్యకరంగా చర్మం ఉండేలా చేస్తాయి. ఫలితంగా చర్మం వృద్ధాప్యం బారిన పడకుండా ఎక్కువ కాలం ఉంటుంది. ఇక ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉండే డార్క్ చాక్లెట్లు కూడా చర్మాన్ని సూర్య కాంతి హాని నుండి కాపాడడంలో ముందుంటాయి.
నిదానంగా చర్మ వృద్ధాప్య ప్రక్రియ
చర్మ వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదించేలా చేస్తాయి. ఇక అవిసె గింజలలోనూ, ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్, ఆల్ఫా లినోలెనిక్ ఆమ్లంతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన చర్మాన్ని కాపాడడానికి ఎంతగానో సహాయపడతాయి. వీటిని యూజ్ చేయడం వల్ల చర్మం తేమగా ఉంటుంది. ఇక దాని వల్ల కూడా యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.
చర్మాన్ని కాపాడి వృద్ధాప్యం తగ్గించే ఆహారం
ఇవి మన చర్మం మరమత్తు చేయడానికి ఎంతగానో సహాయపడతాయి. మన చర్మాన్ని సూర్యకాంతి హాని నుండి కాపాడుతాయి. ఇక పాలకూరలో బోలెడు పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. వారానికి రెండు మూడుసార్లు పాలకూర తింటే చర్మం అందంగా మెరిసిపోతుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications