రోగ నిరోధక శక్తి పెంచుకోవాలంటే ఇవి తినండి!
మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరంలో రోగ నిరోధక శక్తి ఉండాలి. ఇమ్యూనిటీ బాగా ఉంటేనే మనం ఏ పని అయినా సమర్ధవంతంగా చెయ్యగలం. శరీరంలో రోగ నిరోధక శక్తిని బలోపేతం చేసుకోవడానికి మంచి పోషకాలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాలి. మనకు ఎలాంటి రోగాలు రాకుండా కాపాడేది మన రోగ నిరోధక శక్తి.
వీటితో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
పండ్లు,ఆకుకూరలు, కూరగాయలు, గింజ ధాన్యాలు, సీడ్స్, నట్స్ వంటి మంచి పౌష్టిక ఆహారాలను తీసుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచుకోవటం కోసం విటమిన్ సి ఉన్న నారింజ,బత్తాయి, నిమ్మ లాంటి జ్యూస్లు తీసుకోవడం మంచిది. అలాగే ప్రతీరోజూ ఒక గుడ్డు తినటం మేలు చేస్తుంది. గుడ్డు తింటే రోగ నిరోధక శక్తి బలోపేతం అవుతుంది.

ఇవి ఆహారంలో భాగం చేసుకుంటే ఇమ్యూనిటీ
ఆకుకూరలు, పాలకూర,తోటకూర లాంటి కూరలతో మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఆకుకూరలలో విటమిన్ ఏ, విటమిన్ సి ఉంటాయి. అంతేకాదు మెగ్నీషియం, పొటాషియం కూడా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించటం కోసం బాగా దోహదం చేస్తాయి. ఇక మనం తీసుకునే ఆహారాలలో నట్స్ కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. నట్స్ మన శరీరానికి కావాల్సిన పోషకాలను ఇస్తాయి.
ఇవి తింటే రోగ నిరోధక శక్తి
మనం ఇంట్లో తయారు చేసుకునే ఆహారాలతోనే రోగ నిరోధక శక్తిని మనం బలోపేతం చేసుకోవచ్చు. మటన్, చేపలు వంటి వాటిని తినటం కారణంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అల్లం,వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరిగింది. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉండటం చేత బాడీ తొందరగ డిహైడ్రేషన్ కు గురవుతుంది. కాబట్టి నీరు శరీరానికి చాలా అవసరం.
ఆహారపు అలవాట్లు మన ఇమ్యూనిటీకి దోహదం చేస్తాయి
బాడీకి కావలసిన నీరు మనము ఎప్పటికప్పుడు తీసుకోవడం వలన రోగనిరోధక శక్తిని పెంచుకున్న వాళ్ళం అవుతాము. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి అదనపు చక్కెరను తగ్గించుకోండి. అదనపు చెక్కర పదార్థాలను తినడం వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎక్కువ చెక్కర పదార్ధాలను, జంక్ ఫుడ్స్ ను తినకూడదు. ముఖ్యంగా మనం తినే ఆహారపు అలవాట్లు మన ఇమ్యూనిటీకి దోహదం చేస్తాయి. కనుక ఆహారం విషయంలో జాగ్రత్త.












Click it and Unblock the Notifications