బరువు తగ్గాలంటే ఆకలిని తగ్గించే ఈ సూపర్ ఫుడ్స్ తినండి!

విపరీతంగా బరువు పెరిగినవారు బరువు తగ్గాలని తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. యోగా, వ్యాయామం వంటి వాటిని మాత్రమే కాకుండా ఆహారపు అలవాట్లను, జీవనశైలిని మార్చుకునే ప్రయత్నం చేస్తారు. అటువంటివారు బరువు తగ్గడం కోసం మనకు ఆకలి తక్కువగా అనిపించే ఆహారాలు తీసుకోవడం మంచిదని, ఆహారాలతో బరువు ఈజీగా తగ్గవచ్చని డైటీషియన్లు చెబుతున్నారు.మరి ఆ ఆహారాలు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

ఆకుకూరలతో బరువుకు చెక్
ఆకుకూరలు మన బరువును తగ్గిస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఆకుకూరలలో బచ్చలి కూర, పాలకూర వంటి ఆకుకూరలు తక్కువ క్యాలరీలను కలిగి ఉండి, వీటిని తినడం వల్ల ఆకలిని తగ్గిస్తాయని చెబుతున్నారు. వీటిల్లో ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల త్వరగా ఆకలి కాకుండా ఎక్కువ ఆహారాన్ని తీసుకోకుండా నిరోధించి బరువు తగ్గడానికి దోహదం చేస్తాయని చెబుతున్నారు.

Eat these superfoods that reduce appetite to lose weight

ఇవి తింటే ఆకలి తగ్గుతుంది.. బరువు పెరగకుండా చేస్తుంది
ఇక కోడిగుడ్లు తినడం వల్ల కూడా బరువు తగ్గుతామని చెబుతున్నారు. కోడిగుడ్లలో ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది మనకు ఆకలి కాకుండా నిరోధిస్తుందని చెబుతున్నారు స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ప్ బెర్రీలు వంటి బెర్రీలలో క్యాలరీలు తక్కువగా ఉంటాయని ఫైబర్, నీరు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. వీటిని తినడం వల్ల కడుపు నిండిన భావన కలిగి ఎక్కువ ఆహారం తీసుకోకుండా ఉంటామని చెబుతున్నారు.

ఇవి తీసుకోండి ... బరువు తగ్గండి
అంతేకాదు భోజనాన్ని ప్రారంభించే ముందు ఏవైనా సూప్స్ ను తీసుకుంటే, ఆ సూప్స్ లో కూరగాయలను జోడించి తీసుకుంటే కూడా ఆకలి కాకుండా ఉంటుందని చెబుతున్నారు. క్వినోవాలో కూడా ఆకలిని తగ్గించే లక్షణాలు ఉన్నాయని, క్వినోవాలో ఉండే ప్రోటీన్, ఫైబర్ తో పాటు ముఖ్యమైన అమైనో ఆమ్లాలు బరువు తగ్గడానికి దోహదం చేస్తాయని చెబుతున్నారు

వీటితో బరువు తగ్గొచ్చు
ప్రతిరోజు ఒక యాపిల్ ను తింటే కూడా కడుపు నిండిన ఫీలింగ్ కలిగి బరువు తగ్గుతారని చెబుతున్నారు. ఓట్స్ ఒక అద్భుతమైన అల్పాహారమని ఓట్స్ తింటే కూడా కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఇది బరువు తగ్గడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. చిక్కుళ్ళు, బీన్స్, కాయధాన్యాలు పుష్కలంగా ప్రోటీన్, ఫైబర్ ఉండడం వల్ల ఇవి కూడా ఆకలిని తగ్గించి బరువు తగ్గడానికి దోహదం చేస్తాయి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+